నిహారిక రెండో పెళ్లి గోల.! అసలు కథేంటి.?

నిహారిక, ఆమె భర్త చైతన్య దూరంగా వుంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయ్. విడాకులు తీసుకోబోతున్నారన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకుంది ఈ జంట. దాంతో, ఈ ప్రచారానికి ఇంకాస్త ఆధ్యం పోసినట్లయింది.

అయితే, ఈ ప్రచారాన్ని ఖండించే దిశగా ఇటు నిహారిక కానీ, అటు మెగా ప్యామిలీ కానీ రెస్పాండ్ కావడం లేదు. ఇదిలా వుంటే, సందట్లో సడేమియా అన్నట్లుగా సాయి ధరమ్ తేజ్‌తో నిహారిక రెండో పెళ్లంట.. అనే గాసిప్ తాజాగా చక్కర్లు కొడుతోంది.

తేజు నటించిన ‘విరూపాక్ష’ సినిమా రిలీజ్ సందర్భంగా ‘హారర్ మూవీస్ అంటే నాకు భయం అయినా బావా నీ కోసమే ఈ సినిమా చూస్తున్నా..’ అంటూ నిహారిక పెట్టిన పోస్టే ఈ గాసిప్‌కి బూస్టప్ కావచ్చు.

అయితే, ఎందుకో మరి, ఇలాంటి గాసిప్స్‌ని నిహారిక, అలాగే మెగా ఫ్యామిలీ కూడా ఖండించడం లేదు. బహుశా మౌనం అర్ధాంగీకారం అనుకోవాలేమో.. అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

అలాగే, ఇదంతా గిట్టని వాళ్లు చేస్తున్న దుష్ప్రచారం అని కూడా అంటున్నారు. అయినా, ఒక్క ట్వీట్, లేదా ఒక ఇన్‌స్టా పోస్ట్‌తో ఈ తప్పుడు గాసిప్స్ అన్నింటికీ చెక్ పెట్టొచ్చు. కానీ, నిహారిక ఎందుకని వీటిని ఎంటర్‌టైన్ చేస్తుందో తెలీయడం లేదు.