ప్రేమతో చేసింది కదా!!.. నిహారికను మెప్పించిన వరుణ్ తేజ్

Niharika Gave Judgement On Varun Tej Cooking

అన్నా చెల్లెల్లి బంధం ఎలా ఉంటుందో.. ఎంత గొప్పగా ఉంటుందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌లో నిహారిక, వరుణ్ తేజ్ హైలెట్ అవుతుంటారు. మామూలుగా మెగా ఫ్యామిలీ అంతా అంతే సరదాగా ఉంటారు. ఏదైనా ఈవెంట్స్ జరిగినా, పండుగల వచ్చినా మెగా ఫ్యామిలీ అంతా ఒకే చోట కలుస్తుంటారు. సంక్రాంతి, దీపావళి వంటి ప్రత్యేక సందర్భాల్లో అయితే మరో లెవెల్‌లో రచ్చ చేస్తారు.

Niharika Gave Judgement On Varun Tej Cooking
Niharika Gave Judgement On Varun Tej Cooking

ఇక నాగబాబు ఫ్యామిలీ అయితే ఎంత జాలీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. నిహారిక అంటే అందరికీ ఇష్టమే. ఈ క్రమంలో నిహారిక ఓ ఇంటిది కాబోతోంది. ఇప్పటికే నిశ్చితార్థం కూడా అయిపోయింది. గుంటూరు ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం కానున్నట్టు తెలుస్తోంది. ఈ లోపే చెల్లిపై ఉన్న ప్రేమను చూపించాలని ఫిక్స్ అయినట్టున్నాడు వరుణ్ తేజ్.

Niharika Gave Judgement On Varun Tej Cooking
Niharika Gave Judgement On Varun Tej Cooking

మొదటి సారిగా వంట చేశానని చెప్పిన వరుణ్ తేజ్.. తన ముద్దుల చెల్లికి ఇచ్చి రుచి చూడమన్నాడు. ఇక ప్రేమతో అన్నయ్య చేసిన వంట చెల్లెలి మనసు దోచుకోకుండా ఉంటుందా మరి. రుచి చూసిన నిహారిక అదిరిపోయిందని కితాబిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అలా ఫస్ట్ అటెంప్ట్‌లోనే డిస్టింక్షన్ లెవెల్‌లో పాసయ్యాడు వరుణ్ తేజ్.