నన్ను భరించేందుకు రెడీయేనా?.. ఫ్లైట్‌లో నిహారిక చైతన్య సరసాలు!!

Niharika Funny Comments On Chaitanya In Flight To Udaipur

మెగా డాటర్ నిహారిక చైతన్యల వివాహానికి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్‌లో భాగంగా పెళ్లిని రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో గ్రాండ్‌గా జరగబోతోంది. డిసెంబర్ 9న జరగబోయే ఈ వివాహా వేడుకకు మెగా అల్లు ఫ్యామిలీలు బయల్దేరాయి. ఒక్కొక్క ఫ్యామిలీ స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఉదయ్ పూర్‌కు వెళ్తున్నాయి. ఈ క్రమంలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఫ్యామిలీలు కలిసి బయల్దేరాయి. బన్నీ ఫ్యామిలీ, చెర్రీ ఫ్యామిలీ, శ్రీజ ఫ్యామిలీ ఇలా అందరూ ఫ్లైట్స్ ఎక్కేశారు.

అయితే నిహారిక చైతన్యల ఫ్యామిలీలు కలిసే వెళ్లాయి. ఆ ఫ్లైట్‌లో నిహారిక సందడి మామూలుగా లేదు. తండ్రితో సెల్ఫీలు, భర్తతో ముచ్చట్లు పెడుతూ రచ్చ చేస్తోంది. ఇక చైతన్యతో ముచ్చట్లు పెడుతున్న ఫోటోను వరుణ్ తేజ్ తీసినట్టున్నాడు. ఆ ఫోటోను షేర్ చేసిన నిహారిక.. అదిరిపోయే క్యాప్షన్ పెట్టేసింది. నాతో రోల్ క్యాస్టర్ రైడ్ చేసేందుకు రెడీనా? అంటూ చైతన్యను నిహారిక ప్రశ్నించింది. అంటే పరోక్షంగా నిహారిక చైతన్యను హెచ్చరించినట్టు కనిపిస్తోంది.

Niharika Funny Comments On Chaitanya In Flight To Udaipur
Niharika Funny Comments On Chaitanya In Flight To Udaipur

రోలర్ క్యాస్టర్ రైడ్ అంటూ లేవడం పడిపోవడం.. పైకి కిందకు పడటం.. ఇలా మొత్తం రకరకాలుగా జీవితంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.. ఇక నీకు చుక్కలే అన్నట్టుగా హింట్ ఇచ్చినట్టుంది. అయితే నిహారిక పోస్ట్‌కు కొత్త పెళ్లి కొడుకు కూడా సమాధానం ఇచ్చాడు. నిహారిక భయపెట్టినా కూడా భయపడకుండా.. సరే అంటూ ఓకే చెప్పేశాడు. మొత్తానికి ఈ ఇద్దరి మధ్య పెళ్లికి ముందే మంచి బాండింగ్ ఏర్పడినట్టు కనిపిస్తోంది. మాటముచ్చట్లు అయిన క్షణం నుంచి ఈ ఇద్దరూ జంట పక్షుల్లా తిరుగుతూనే ఉన్నారన్నసంగతి తెలిసిందే.