Niharika Konidela: నిహారిక నిజంగా ఇంస్టాగ్రామ్ ఖాతా డిలీట్ చేసిందా?ఆ వీడియో నే కారణమా!

Niharika Konidela In Bapu Bommaki Pellanta

Niharika : మెగా కాంపౌండ్ నుండి అందరూ హీరోయిన్ లు వచ్చారు అయితే నాగబాబు కూతురు నిహారిక మెగా డాటర్ గా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. సినిమాలు అంత కలిసి రాకపోవడంతో యూట్యూబ్ లో వెబ్ సిరీస్ తో బాగానే పేరు తెచ్చుకుంది.

ఆ తర్వాత పెద్దలు కుదుర్చిన పెళ్లి చేసుకుంది. జొన్నలగడ్డ చైతన్య తో పెళ్లి తర్వాత నిర్మాత గా మారి వెబ్ సిరీస్ లు తీస్తూ తన ప్రతిభను నిరూపించుకుంటోంది.నిత్యం సోషల్ మీడియా లో చురుకుగా గా ఉండే నిహారిక తన భర్త తో దిగిన ఫోటోలు ఫ్రెండ్స్ తో దిగిన ఫోటో లు వీడియోలు షేర్ చేస్తూ సందడి చేసేది. అయితే నిహారిక తన ఇంస్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేయడం తో ఇప్పుడు అందరి దృష్టి నిహారిక పై పడింది.

నిహారిక సోషల్ మీడియా లో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ సరదా ఫోటోలు తన ఫిట్ నెస్ కి సంబందించిన వీడియోలు పంచుకునేది.నిహారిక షేర్ చేసిన ఒక వీడియో వల్ల ఇంస్టాగ్రామ్ ఖాతా ను డిలీట్ చేసిందని టాక్ వినిపిస్తోంది. నిహారిక వెబ్ సిరీస్ లు చేస్తూ నిర్మాతగా ను ఉండటం వల్ల యూట్యూబర్ అయిన కాస్కో నిఖిల్ తో మంచి స్నేహం ఉంది.

టామ్ అండ్ జెర్రీ లాగా గొడవపడుతూ ఉంటారు వీళ్లిదరు. ఈ వీడియోస్ ని షేర్ చేస్తుంటారు కూడా.అయితే ఈ మధ్య నిహారిక పోస్ట్ చేసిన జిమ్ వర్కౌట్ వీడియో లో నిహారిక నిఖిల్ మీద కూర్చుని ఉంటే నిఖిల్ పుష్ అప్స్ చేస్తుంటాడు. ఈ వీడియో పై అనేక ట్రోల్ల్స్ వచ్చాయి. కొంతమంది నెటిజన్లు మెగా కుటుంబం నుండి వచ్చి ఇలాంటి వీడియోలు చేయడం ఏంటని అడుగగా, మరి కొంతమంది పెళ్లి అయ్యాక ఇలాంటి పనులు చేయడమేంటని విమర్శిస్తున్నారు. దీంతో నిహారిక అకౌంట్ డిలీట్ చేసిందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. సాధారణ ప్రజలు ఎం చేసిన పర్వాలేదు కానీ సెలబ్రిటీలు ఇలా ఆలోచించకుండా చేస్తే నెగెటివిటీ ను మూటగట్టుకుంటారు.