సూర్యుడినే మింగేస్తోన్న మెగా డాటర్.. నిహారికతో అంత వీజీ కాదు!!

Niharika Chaitanya enjoys in Mega Bhogi Celebrations

మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. కొంటె పనులతో నిహారిక చేసే సందడికి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. పెళ్లి తరువాత నిహారిక ఎంత సందడి చేస్తోందో అందరిక తెలిసిందే. నిన్న మొన్నటి వరకు ముంబైలో ఉన్న నిహారిక భోగీ సందర్భంగా మెగా ఇంట్లో వాలింది. సంక్రాంతి పండుగను మెగా ఫ్యామిలీ అంతా ఒకే చోట జరుపుకుంటుందన్న సంగతి తెలిసిందే. మెగా అల్లు ఫ్యామిలీలంతా కూడా ఒకే చోటకు చేరుకుంటారన్న సంగతి తెలిసిందే.

Niharika Chaitanya enjoys in Mega Bhogi Celebrations
Niharika Chaitanya enjoys in Mega Bhogi Celebrations

భోగీ మంటలు పెట్టి దాని చుట్టూరా మెగా అల్లు ఫ్యామిలీలు సందడి చేస్తుంటారు. ఇక క్యాంప్ ఫైర్‌లో సందడి చేసినట్టుగా అందరూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీలో కరోనాయే లేదు కాబట్టి అందరూ ఎంచక్కా సందడి చేస్తున్నారు. చిరు కూతుళ్లు, అల్లు పిల్లలు, మనవరాళ్లు ఇలా ప్రతీ ఒక్కరూ మెగా ఇంట్లోనే రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ అందరిలోనూ నిహారిక చైతన్యల జంట మాత్రం వేరే లెవెల్‌లో రచ్చ చేస్తున్నట్టు కనిపిస్తోంది.

నిహారిక సూర్యుడిని మింగేసే ప్రయత్నం చేస్తోంది. ఆ మూమెంట్‌ను చైతన్య తన కెమెరాలో బంధించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ ఇద్దరూ ఒకరి కళ్లళ్లో మరొకరు చూస్తుంటే మధ్యలో సూర్యుడున్నాడు. మొత్తానికి ఇలా కొత్త జంట మాత్రం ఎక్కడా పడితే అక్కడే రొమాన్స్ చేసేస్తోంది. ఇలా ఈ కొత్త జంటతో మెగా సంబురాలు రెట్టింపు అవుతున్నట్టున్నాయి. ఇక ఉదయాన్నే చిరు అందరికీ స్పెషల్ దోశలు వేయించి ఇస్తున్నట్టు కనిపిస్తోంది.