హీరోయిన్‌గా రీ ఎంట్రీ కోసం మెగా డాటర్ నిహారిక సమాయత్తమవుతోందట.. స్వీయ నిర్మాణంలోనే ఓ సినిమా చేయబోతోందట నిహారిక.
ఈ మధ్య డివోర్స్అనీ.. అదీ ఇదీ అంటూ వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. అలాగే, సోషల్ మీడియాలోనూ గ్లామర్ తెరలు తెంచేసి రచ్చ రచ్చ చేస్తోంది నిహారిక.
ఆ రకంగానూ హాట్ టాపిక్ అవుతోంది మెగా డాటర్. ఇదంతా ఎందుకయ్యా అంటే.. నిహారిక మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం కోసమే అంటున్నారు. అవునటండీ.! నిహారిక హీరోయిన్‌గా ఓ సినిమా తెరకెక్కుతోందట.
కాన్సెప్ట్ బేస్‌లో ఈ సినిమా వుండబోతోందట. ప్రజెంట్ యూత్‌కి కనెక్టివ్‌గా వుండబోతోందట. పెళ్లి విషయంలో యూత్ మైండ్ సెట్ ఎలా వుండబోతోంది.? ఎలాంటి నిర్ణయాలు ఎప్పుడెప్పుడు ఎలా తీసుకుంటున్నారు.? తద్వారా వారు ఎదుర్కొంటున్న పరిణామాలేంటీ.? ఫ్యామిలీ విషయంలో వాటి తాలూకు అలజడులు.. ఆందోళనలు ఎలా వుండబోతున్నాయ్.? అనే అంశాల్ని ఈ సినిమాలో స్పృశించబోతున్నారట.
రీసెంట్‌గా ఆ ప్రాబ్లెమ్స్ అన్నీ తన పర్సనల్ లైఫ్‌లో నిహారిక ఎదుర్కొన్నదే. అందుకే నేచురల్‌గా ఈ సినిమాకి ప్రాణం పోస్తుందని నమ్ముతున్నారు. ఓ యంగ్ హీరో ఈ సినిమాలో నిహారికకి జోడీగా నటించబోతున్నాడనీ తెలుస్తోంది.
డైరెక్టర్ ఎవరు.? తదితర పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయ్.