ప్రభాస్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ రాజసాబ్ గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ లీక్ వస్తోంది. మేకర్స్ ఈ సినిమా కోసం హై లెవెల్ వీఎఫ్ఎక్స్ వాడుతున్న నేపథ్యంలో, దీని విడుదల వాయిదా పడింది. అయితే ఈ గ్యాప్‌ను క్యూరియాసిటీ పెంచేందుకు టీమ్ వినూత్న ప్రమోషన్ ట్రిక్స్ ఉపయోగిస్తోందని అనిపిస్తోంది. లేటెస్ట్ గా హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటి వరకు ప్రేక్షకులందరూ ఆమె రోల్ ను హారర్ ఎలిమెంట్‌గా ఊహించుకున్నారు. అయితే నిధి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన క్యారెక్టర్ భయపెట్టేలా ఉంటుందే తప్ప, ఇది దెయ్యం పాత్ర కాదని క్లారిటీ ఇచ్చింది. ఆమె పాత్ర కథలో కీలక మలుపు తిప్పేలా ఉండబోతుందని హింట్ ఇచ్చింది. సెట్స్‌లో ప్రభాస్‌తో కలిసి పని చేసిన అనుభవం గురించి మాట్లాడుతూ, “ఇంత కొత్తగా, అద్భుతమైన ఎనర్జీతో ఉన్న యూనిట్‌తో పని చేయడం ఇదే తొలిసారి. కథ కూడా చాలా యూనిక్‌గా ఉంటుంది” అంటూ సినిమాపై ఆసక్తిని పెంచింది.
సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉన్నా, ఎక్కువగా మాళవిక మోహనన్ క్యారెక్టర్ గురించే టాక్ వినిపించింది. కానీ నిధి పాత్రపై మిస్టరీ కొనసాగించడం, ప్రమోషన్స్‌లో ఆమె లుక్ బయటకు రానీయకపోవడం అందరిలోనూ క్యూరియాసిటీని పెంచింది. ఆమె చేసిన కామెంట్స్ ప్రకారం, రాజసాబ్ కథలో అనుకోని మలుపులు ఉంటాయని, కథ ఎలా మారిపోతుందో ప్రేక్షకులు ఊహించలేరని అర్థమవుతోంది.
ఇక బాలీవుడ్‌లో ఈ సినిమాను భారీగా రిలీజ్ చేయాలని భూషణ్ కుమార్ ప్రణాళికలు రచిస్తున్నాడు. ప్రభాస్ మార్కెట్ ఎప్పుడూ నార్త్ ఇండియాలో స్ట్రాంగ్, అయితే హారర్ కామెడీ జానర్‌లో ఇంతవరకు లేని స్టైల్‌లో కనిపించబోతుండటంతో హిందీ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు, నిధి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లులో నటిస్తుండటంతో పాటు, సూర్యతో ఓ కొత్త తమిళ సినిమా చేసే చాన్స్ ఉందన్న ప్రచారం కూడా ఉంది. రాజసాబ్ ప్రమోషన్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇక నిధి అగర్వాల్ ఈ సినిమాతో ఎలాంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి.