బుల్లితెర బ్యూటీ కమ్ రంగమ్మత్త అలియాస్ అనసూయ మానసిక ప్రశాంతత కోరుకుంటోందట. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండతో సోషల్ వార్‌కి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటోందట.
విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ ఈ మధ్య కాలంలో అనసూయ చేసిన అతి దారుణంగా విమర్శలకు తావిచ్చింది. దాంతో, విజయ్ దేవరకొండతో కాంప్రమైజ్‌కి వచ్చిందట.
అయితే, విజయ్ దేవరకొండ ఈ వివాదాన్ని చాలా చాలా లైట్ తీసుకున్నాడట. దీన్ని అసలు తాను పట్టించుకోనేలేదు.. అంటున్నాడట. దాంతో అనసూయ ప్లేట్ ఫిరాయించేసింది. విజయ్ దేవరకొండ తాలూకు మనిషి ఎవరో డబ్బులిచ్చి మరీ తనను ట్రోల్ చేయిస్తున్నడంటూ నమ్మబలికింది.
ఈ రగడ విజయ్ దేవరకొండకు బహుశా తెలుసో లేదో.. ఒకవేళ తెలయకపోవచ్చు.. అంటోంది. ఇంత తెలిసిన అనసూయ.. ఎవరో చేసినదానికి విజయ్ దేవరకొండని ఎందుకు టార్గెట్ చేయాలి.? ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యి, దొంగ దొరికేసినట్లయ్యింది. అడ్డంగా బుక్కయిపోయింది అనసూయ.