ప్రెస్ మీట్లలోనూ, ఇంటర్వ్యూలలోనూ తిట్టించుకోవడం ఓ ఫ్యాషన్ అయిపోయిందిప్పుడు. ప్రెస్ మీట్లూ, ఇంటర్వ్యూలు పేరు చెప్పి సెలబ్రిటీలతో పిచ్చ పిచ్చగా తిట్టించుకోవడం.. ఆ పై సోషల్ మీడియాలో వైరల్ కావడం.. ఇదీ నయా ట్రెండ్ సినీ మీడియా ప్రతినిధులకి.
అలా పలువురు సినీ మీడియా జర్నలిస్టులు ఈ మధ్య తెగ పాపులర్ అయిపోయిన సంగతి దాదాపు అందరికీ తెలిసిందే. అయితే, ఈ ట్రెండింగ్ యవ్వారమై ఓ న్యూస్ తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది.
కేవలం వైరల్ అయ్యేందుకో.. లేదంటే, ట్రెండింగ్ అయ్యేందుకో సో కాల్డ్ జర్నలిస్టులు ఇలా తిట్టించుకోవడం లేదటండోయ్. ఆ తిక్కకీ ఓ లెక్కుందట.
లెక్కంటే.. డబ్బుల లెక్కండోయ్. ప్రెస్ మీట్‌లో తిట్టించుకుంటే ఓ లెక్క. ఇంటర్వ్యూలో తిట్టించుకుంటే ఇంకో లెక్క. ఇంతకీ ఏంటా లెక్క.? అంటారా.? ఈ సెపరేట్ కళకీ ఓ స్పెషల్ ప్యాకేజీ వుందండోయ్. పదివేల నుంచి ఐదు లక్షల వరకూ పలుకుతోందట ఈ తిట్ల జర్నలిస్టుల రేటు.
చూశారా.? ఎలా తయారైందో పరిస్థితి.? బొత్తిగా సిగ్గొదిలేశారంతే. డబ్బు కోసం మరీ ఇంత గడ్డి తింటారా.? ఇదే ఇప్పుడు సినీ మీడియా వర్గాల్లో జరుగుతోన్న చర్చ.! వింతగా అనిపించడం లేదూ.!