Priyanka juwalkar : సినిమా హీరోయిన్లకు క్రికెటర్స్ కు మధ్య సంబంధం ఇప్పటిది కాదు.బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా చాలా మంది హీరోయిన్స్ క్రికెటర్ లతో ప్రేమాయణం నడిపారు. ఇక విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ల గురించి చెప్పక్కర్లేదు. ఇక రీసెంట్ గా ఓ టాలీవుడ్ కుర్ర హీరోయిన్ పేరు కూడా ఇలా వినిపిస్తోంది.క్రికెటర్ తో ప్రేమలో ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ట్యాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అందాల ముద్దుగుమ్మ ప్రియాంక జువాల్కర్. ఇక ఈ తెలుగమ్మాయి టాక్సీవాలా చిత్రంతో విజయ్ దేవరకొండ పక్కన నటించి మెప్పించింది.ఇక ఈ అమ్మడు నటించిన ఎస్ ఆర్ కళ్యాణమండపం, తిమ్మరుసు సినిమాలు రెండూ వరుసగా వచ్చాయి. ఈ రెండు సినిమాలకు మంచి సక్సెస్ అందకపోయినా అమ్మడికి మంచి మార్కులే పడ్డాయి.అయితే ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తన హాట్ ఫోటోలను పోస్టు చేస్తూ,కుర్రకారుకి కునుకు లేకుండా చేస్తోంది. ఇక ప్రియాంక సామాజిక మధ్యమాల్లోను చురుకుగా ఉంటుంది.
తాజాగా ప్రియాంక పోస్ట్ చేసిన ఒక ఫొటోకు వర్ధమాన క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ క్యూట్ అంటూ కామెంట్ ఇచ్చాడు. దీనికి బదులుగా ప్రియాంక ఎవరు? నువ్వా..’ అంటూ రిప్లై ఇచ్చింది…ఈ కామెంట్‌కి వేలల్లో లైకులు రాగా, వెంకటేశ్ అయ్యర్ రిప్లైకి దాదాపు 7 వందల మంది రిప్లైలు ఇచ్చారు. ఇక నెటిజన్స్ ఈ ఇష్యూ ని వైరల్ చేసేసారు. వెంకటేష్ అయ్యర్, ప్రియాంక రిలేషన్ షిప్ లో ఉన్నారంటు కొంతమంది కామెంట్ పెడుతుంటే మరి కొంతమంది వెంకటేష్ అయ్యర్ ఎవరో నీకు తెలీదా కాబోయే సూపర్ క్రికెటర్ తెలియదంటే నమ్మాలా పైగా నీ ఇంస్టాగ్రామ్ ఖాతా లో అతడిని ఫాలో అవుతున్నావ్ గా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే వార్తలు వస్తున్నాయి. ఇద్దరు ఈ విషయం పై స్పందిస్తే గాని అసలు విషయం బయటకు తెలియదు