Gallery

Home News బాలయ్య సినిమాకి కొత్త సమస్య .. నిజమేనా ..?

బాలయ్య సినిమాకి కొత్త సమస్య .. నిజమేనా ..?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కలయికలో ఒక లేటెస్ట్ మూవీ తెరకెక్కుతున్న. ఈ సినిమా బాలయ్య, బోయపాటిల కలయికలో వస్తున్న మూడవ చిత్రం కావడంతో బిబి3 అంటూ ఫస్ట్ పేరుతో ఒక టీజర్ ని రిలీజ్ చేసి సినిమా ఎలా ఉండబోతుందో దర్శకుడు బోయపాటి శాంపిల్ చూపించాడు. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Bb3 Teaser Out: Balakrishna Roars In New Film With Boyapati Srinu. Watch -  Movies News

కాగా ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని సినిమాల మాదిరిగా షూటింగ్ ఆగిపోయింది. అయితే లాక్ డౌన్ ముగియండంతో సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ సినిమా మొదలైనప్పటి నుంచి కొన్ని సమస్యలు అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. టైటిల్.. హీరోయిన్.. అలాగే ఈ సినిమాలో బాలయ్య ని ఢీ కొట్టే విలన్. రీసెంట్ గా హీరోయిన్స్ సమస్య తీరిపోయింది.

ఇక మిగిలింది.. టైటిల్.. విలన్. ఇప్పటికే రెండు మూడు టైటిల్స్ అనుకున్నప్పటికి ఫైనల్ గా మోనార్క్ అన్న టైటిల్ ని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇక ఫైనల్ అవ్వాల్సింది విలన్ గా ఎవరు నటిస్తారన్నది ఇంకా క్లారిటీ రావడం లేదు. ఈ సినిమాలో ముందు విలన్ గా బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్ ను అనుకున్నారు. కానీ సంజయ్ ఆరోగ్యం డిస్టర్బ్ కావడం, ఆయన చికిత్స కోసం వెళ్లడంతో ఆ ప్లాన్స్ వర్కవుట్ కాలేదు. అప్పటి నుంచి జగపతి బాబు, వివేక్ ఓబెరాయ్..అంటూ ప్రచారం జరిగింది. కాని ఇంకా ఎవరూ ఫైనల్ కాలేదని త్వరలో బిబి3 కి ఈ సమస్య కూడా తీరబోతుందని అంటున్నారు.

- Advertisement -

Related Posts

పవన్ గురించి రానా ఆసక్తికర కామెంట్స్

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్ మీద భారీ క్రేజ్ నెలకొని ఉంది. ఈ మూవీ రెండు పాత్రల మధ్య హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంటుంది. మరి...

కరోనా మూడో వేవ్: కేరళకు ఏమయ్యింది.?

దేశంలోకి మొదట కరోనా వైరస్ ప్రవేశించిందే కేరళ రాష్ట్రం ద్వారానే. చైనా నుంచి వచ్చిన ఓ కేరళ వ్యక్తి కరోనా వైరస్‌ని దేశంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత దేశంలో కరోనా వైరస్ విస్తరించడానికి...

కేంద్రం కాఠిన్యం: విశాఖ ఉక్కు పరిశ్రమపై వారికి హక్కు లేదా.?

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయమై కేంద్రం రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కేంద్రం పేర్కొన్న అంశాలతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు, కార్మికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.....

Latest News