న్యూ ఇయర్ కి పవన్ బుల్లెట్ లో అదిరిపోయే ఎంట్రీ .. !

sagar k chandra wants to show pawan kalyan as in power role in his movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. సుదీర్ఘవిరామం తర్వాత వకీల్ సాబ్ సినిమా తో మళ్లీ వెండితెరపై మళ్లీ తన మ్యానియా చూపించడానికి సిద్ధమైయ్యాడు. వకీల్ సాబ్ సినిమా ఎప్పుడో విడుదలకావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడి తాజాగా షూటింగ్‌ను ముగించుకుంది.

Boney Kapoor Drops The New Poster Of Pawan Kalyan's 'Vakeel Saab' Movie

వకీల్ సాబ్ నుంచి న్యూయర్ స్పెషల్ పోస్టర్ తో సహా టీజర్ అనౌన్స్మెంట్ వచ్చింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న వకీల్ సాబ్ నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆ పోస్టర్ లో పవన్ కళ్యాణ్, శృతి హాసన్ లు బైక్ జర్నీ చేస్తూ సింపుల్ గా అదరగొట్టారు. ఈ సినిమాను దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా వకీల్ సాబ్ సినిమాని ఏప్రిల్ 9 న రిలీజ్ చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

ఈ సినిమాతో పాటు పవన్ మరో రెండు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఒకటి. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈ సినిమా. ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ మూవీగా వస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయినా అయ్యప్పనుమ్ కోషియమ్.. అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు