ఇండియా లోనే ఏ హీరోకి లేని విధంగా ప్రభాస్ కి..!

పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ స్టార్డం ఉన్న తెలుగు హీరోస్ లో అయితే పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకడు, మరి ప్రభాస్ హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రాల్లో నెక్స్ట్ లెవెల్లో హైప్ ఉన్న చిత్రమే “సలార్ సీజ్ ఫైర్”. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎప్పుడు నుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ మాసివ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై హైప్ ఎలా ఉందంటే ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఈ చిత్రం బుక్ మై షో లో ఇండియన్ సినిమా దగ్గర దేనికి లేని విధంగా 4 లక్షలకి పైగా ఇంట్రెస్ట్స్ ని ఇది నమోదు చేసింది. ఇక ఇదిలా ఉండగా ఈ నెలలో ప్రభాస్ బర్త్ డే కూడా వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ బర్త్ డే కి కూడా ఇండియన్ సినిమా దగ్గర ఏ హీరోకి కూడా చేయని భారీ సెలబ్రేషన్స్ ప్రభాస్ కి ఇపుడు స్టార్ట్ కానున్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్ తో అయితే ప్రభాస్ కి ఒక గ్రాండ్ బర్త్ డే ఈవెంట్ ని ఫ్యాన్స్ చేస్తుండగా దీనికి గాను ఇండియా లోనే ఏ హీరోకి లేని విధమైన అతి పెద్ద భారీ కటౌట్ ని అయితే పెట్టబోతున్నారు అని తెలుస్తుంది.

దీనితో ఈసారి ప్రభాస్ బర్త్ డే వేడుకలు మాత్రం మామూలు లెవెల్లో ఉండవని చెప్పాలి. కాగా ఈ అక్టోబర్ ప్రభాస్ సలార్ ట్రైలర్ కూడా ఉంటుంది అని రూమర్స్ ఉన్నాయి. దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.