గాసిప్ : “భక్త కన్నప్ప” కోసం చేసే ప్లానింగ్స్ తెలిస్తే షాక్..!

ఏ సినీ ఇండస్ట్రీ నుంచి అయినా కూడా ఒకో హీరోకి డెఫినెట్ గా ఒక డ్రీం ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. అలా టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న హీరోస్ లో ఒకడైన మంచు వారి హీరో మంచు విష్ణు బాబు ఇపుడు తన డ్రీం ప్రాజెక్ట్ దగ్గరకి వచ్చాడు. గత ఏడాది “జిన్నా” అంటూ భారీ డిజాస్టర్ ని ఇచ్చిన తాను ఆ సినిమా తర్వాత కూడా సినిమాలు ఆపలేదు.

అలా తన తండ్రి మంచు మోహన్ బాబు నిర్మాణం లోనే భారీ బడ్జెట్ తో అయితే దీనిని ప్లాన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఎప్పటిలానే ట్రోల్స్ తోనే మొదలైంది కానీ ఇపుడు ఈ సినిమా సీరియస్ ప్రాజెక్ట్ గా మారుతుంది. లేటెస్ట్ గా పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఫిక్స్ అయ్యాడు.

తాను ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నట్టుగా మంచు విష్ణు కన్ఫర్మ్ చేయగా దీని తర్వాత జరిగే ప్లానింగ్స్ కోసం తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. ఈ సినిమా కోసం పాన్ ఇండియా వైడ్ గా మరింత మంది బిగ్ స్టార్స్ ని సినిమా కోసం తీసుకొస్తారట. ఇంతే కాకుండా దాదాపు 20 మంది మేర భారీ స్టార్ క్యాస్టింగ్ తో ఈ సినిమా ఉంటుంది అని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఇంకో ఊహించని వార్త ఏమిటంటే ఈ చిత్రాన్ని ఇండియన్ టెలివిజన్ హిస్టరీ లోనే పెద్ద హిట్ అయినటువంటి హిందీ సీరియల్ “మహాభారతం” సీరియల్ ని తీసిన దర్శకుల్లో ఒకరు ఈ సినిమాకి దర్శకత్వ భాద్యతలు చేపట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఒక్క మంచు వారి సినిమా అని పక్కన పెడితే సినిమాకి మాత్రం వారు మామూలు ప్లానింగ్ లు చేయడం లేదు అని చెప్పాలి.