“NBK108” టైటిల్ కి టాలీవుడ్లో నెవర్ బిఫోర్ ప్లానింగ్.!

టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ గాడ్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు అఖండ అలాగే వీరసింహా రెడ్డి అనే రెండు భారీ హిట్స్ తో తన కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ గ్రాసర్స్ ని అందుకోగా ఈ సినిమాల తర్వాత అయితే హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.

అలా తన కెరీర్ లో 108వ సినిమాని ఇప్పుడు దర్శకుడు అనీల్ రావిపూడితో ప్లాన్ చేస్తుండగా ఈ సినిమా పై మంచి హైప్ కూడా ఉండి ఇపుడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇపుడు శరవేగంగా తెరకెక్కుతూ ఉండగా మేకర్స్ ఓ బ్లాస్టింగ్ అప్డేట్ ని ఐతే అందించారు. ఇది వరకు టాలీవుడ్ లో ఏ సినిమాకి కూడా చేయని అదిరే ప్లానింగ్ తో అయితే ఇప్పుడు వస్తున్నారు.

కాగా ఈ సినిమా మాస్ టైటిల్ ని అయితే ఈ జూన్ 10 బాలయ్య బర్త్ డే కానుకగా అనౌన్స్ చేస్తారు అని చాలా మంది అందుకున్నారు కానీ మేకర్స్ అయితే రేపు జూన్ 8నే దీనిని అనౌన్స్ చేస్తున్నట్టుగా తెలిపారు. అంతే కాకుండా రెండు తెలుగు స్టేట్స్ లో ఏకంగా 108 హోర్డింగ్స్ లో అయితే ఈ టైటిల్ ని రివీల్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

దీనితో బాలయ్య సినిమా నెవర్ బిఫోర్ లెవెల్లో వస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి కూడా థమన్ హ్యాట్రిక్ గా బాలయ్య కి వర్క్ చేస్తుండగా షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తుండగా యంగ్ హీరోయిన్ శ్రీ లీల కూడా ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది.