అలాంటి ప్రశ్నలు అడిగిన నెటిజన్లు.. చిర్రెత్తిపోయిన లావణ్య త్రిపాఠి

అందాల రాక్షసి చిత్రంలో లావణ్య త్రిపాఠి చెప్పిన ఓ డైలాగ్ ఎంతో ఫేమస్ అయింది. అది అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘నాన్న నాకు త్వరగా పెళ్లి చేయండి.. ఈ చదువులు నా వల్ల కావడం లేదు’ అని లావణ్య ఎంతో క్యూట్‌గా అడుగుంది. అది చిన్మయి గొంతే అయినా లావణ్య మాత్రం ఆపాత్రలో జీవించేసింది. కానీ నిజ జీవితంలో మాత్రం లావణ్య ఆ డైలాగ్ ఇంట్లో వాళ్లతో చెప్పిందో లేదో. కానీ తాజాగా ఈ డైలాగ్‌నే నెటిజన్లు లావణ్యకు వేస్తున్నారు.

Netizens Asking About Lavanya Tripathi marriage
Netizens Asking About Lavanya Tripathi marriage

లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. నిత్యం తన అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. వారితో సమయం దొరికినప్పుడల్లా ముచ్చటిస్తూనే ఉంటుంది. తాజాగా లావణ్య తన ఫ్యాన్స్‌తో ముచ్చటించేందుకు రెడీ అయింది. ఏదైనా అడగండి.. అని నెటిజన్లకు ఆఫర్ ఇచ్చింది. అయితే ఈ క్రమంలో నెటిజన్లు మాత్రం పెళ్లికి సంబంధించిన ప్రశ్నలే ఎదురయ్యాయి.

Netizens Asking About Lavanya Tripathi marriage
Netizens Asking About Lavanya Tripathi marriage

మీ చేతికి ఉంగరం ఉంది పెళ్లి ఎప్పుడు అని ఓ నెటిజన్ అడిగాడు. ఏ ఎందుకు.. అమ్మాయిలు వారిది వాళ్లే ఉంగరాలు కొనుక్కోలేరా?.. అది నాకు నేనుగా ఇచ్చుకున్న బర్త్ డే గిఫ్ట్ అని క్లారిటీ ఇచ్చింది. ఇక మరో నెటిజన్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావ్ అక్కా.. అని ప్రశ్నించాడు. దీంతో చిర్రెత్తిపోయిన లావణ్య.. మా పేరెంట్స్‌కు లేనిబాధ మీకెందుకయ్యా అని అసహనం వ్యక్తం చేసింది. మొత్తానికి లావణ్య పెళ్లి మాత్రం ఓ రేంజ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.