పాన్ ఇండియన్ స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈశ్వర్ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు. బాహుబలి, బాహుబలి 2 సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రభాస్ ని పాన్ ఇండియా హీరోగా మార్చేసాయి. ఆ సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు అన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నాయి.
ఈ క్రమంలో ఇటీవల ప్రభాస్ పూజ హెగ్డే జంటగా నటించిన రాధే శ్యామ్ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా నార్త్ లో కనీసం పాతిక కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. నార్త్ ఇండస్ట్రీలో ఈ సినిమా కేవలం 18 కోట్లకు మాత్రమే పరిమితం అయింది. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన కార్తికేయ 2 సినిమా చూడమంటూ నెటిజన్స్ ప్రభాస్ ని ట్రోల్ చేస్తున్నారు. కేవలం పాతిక కోట్లతో రూపొందిన కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే 16 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఈ వారంలో పాతిక కోట్ల టార్గెట్ ని సునాయాసంగా చేరుకోనుంది.
రాధే శ్యామ్ సినిమాని గుర్తు చేస్తూ ప్రభాస్ ని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ ని టార్గెట్ చేసి ప్రభాస్ కు కథ ఎంపిక రాదంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మేకింగ్ పై ప్రభాస్ కి ఇంకా పట్టు లేదంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రాధేశ్యామ్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ కు కూడా కార్తికేయ 2 సినిమాని చూపించాల్సిన అవసరం ఉందంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. తక్కువ బడ్జెట్ లో చందు మొండేటి అద్భుతాలను సృష్టించాడు. అతనిని చూసి తెలుసుకోవాల్సిన అవసరం రాధాకృష్ణకు ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తక్కువ బడ్జెట్ తో ఎటువంటి అంచనాలు లేకుండా రూపొందిన కార్తీకేయ 2 సినిమా వల్ల ప్రభాస్ పై చాలా విమర్శలు వినిపిస్తున్నాయి.