గుర్రం కాదు.. గాడిదంటూ ఆశు రెడ్డిను భారీ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే?

సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యే వారికి ఆశు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టిక్ టాక్ వీడియోల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె సమంత పోలికలతో ఉండడంతో చాలామంది జూనియర్ సమంత అంటూ ఈమెని పాపులర్ చేశారు. ఇలా సోషల్ మీడియా పుణ్యమా అంటూ రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయారు. ఈ విధంగా బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఆశు రెడ్డి రెండుసార్లు బిగ్ బాస్ కార్యక్రమంలో అవకాశం అందుకొని మరింత గుర్తింపు పొందారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె సోషల్ మీడియా వేదికగా యధావిధిగా తన రచ్చ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఒక డబ్ స్మాష్ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా సోఫాలో ఒక అబ్బాయి కూర్చోగా తన పక్కనే కూర్చున్న ఆశు
కాలం మారిపోయి పద్ధతులు మారిపోయగాయి గానీ.. నాకే గాని స్వయంవరం పెడితే.. ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకొని వచ్చేవాళ్లో తెలుసా ‘ అంటూ ఆమె డైలాగ్ చెప్పగా వెంటనే తన పక్కన ఉన్న అబ్బాయి తన తల పై ఒక దెబ్బ వేశాడు.

ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజనులు ఈ వీడియో పై స్పందిస్తూ పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నీకోసం గుర్రంపై కాదు గాడిదపై వస్తారు అంటూ కొందరు కామెంట్లు చేయగా… మరికొందరు మొహానికి ఉన్న మేకప్ తీసేసి వీడియోలు చెయ్యి ఒక లైకు కూడా రాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరైతే ఏకంగా నీపై దాడి చేయడానికి కుక్కలను కూడా వదులుతారు అంటూ భారీగా ఈమెను ట్రోల్ చేస్తున్నారు.