మెగా డాటర్ నిహారిక ఎప్పుడో ఏదో ఒక ట్రోల్స్ కి గురి అవుతూ ఉండడం కామన్ అయిపోయింది. ఇప్పుడు మరొకసారి మళ్ళీ ట్రోల్స్ కి గురవుతుంది. నిజానికి తమ అభిమాన హీరోల కొడుకులు హీరోలు అవ్వచ్చు గాని హీరోల కూతుర్లు హీరోయిన్లు అవ్వటానికి అభిమానులు అంతగా ఇష్టపడరు. వారు వేరే హీరోతో రొమాన్స్ చేస్తే తమ పరువు పోయినట్లు ఫీల్ అవుతారు.
అయితే ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక కోలీవుడ్ లో మద్రాస్ కారన్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం సఖి మూవీ లోని అలలే.. సాంగ్ ని రీమేక్ చేశారు షేర్ నిగం హీరోగా నటించిన ఈ మూవీకి వాలి మోహన్ దాస్ డైరెక్టర్. ఈ పాటలో నిహారిక డాన్స్ మూవ్స్ తో ఇరగదీసేసింది. అయితే ఈ పాటలో చూపించిన రొమాంటిక్ సీన్స్ లో నిహారిక హాట్ బెడ్రూం సీన్స్ గురించే టాలీవుడ్ లో ఎక్కువగా చర్చ జరుగుతోంది.
ఈ సినిమాలోని రొమాంటిక్ డ్యూయిట్ సాంగ్ ప్రోమోనో ఇటీవల మేకర్స్ రిలీజ్ చేయగా ఆ ప్రోమోను చూసిన నేటిజన్స్ నిహారికను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి పాటల్లో నటించి నిహారిక మెగా ఫ్యామిలీ పరువు మొత్తం తీసేస్తోంది, ఈ టైప్ సినిమాలు చేయటం నీకు అవసరమా, చక్కగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసుకోవచ్చు కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు ప్రోమో లోనే ఈ రేంజ్ కెమిస్ట్రీ ఉంటే ఫుల్ సాంగ్ లో ఇంకెంత ఉంటుందో అని కామెంట్స్ వినబడుతున్నాయి.
ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం నిహారిక తెలుగులో వాట్ ది ఫిష్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది, గత ఏడాది డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇటీవల సోనీ ఓటిటిలో రిలీజ్ అయిన బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ లో గెస్ట్ రోల్ లో కనిపించింది ఈ వెబ్ సిరీస్ ని నిహారికనే ప్రొడ్యూస్ చేసింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ రొమాన్స్ లో శృతిమించటమే బాగోలేదు అంటున్నారు మెగా ఫ్యాన్స్.