16 ఏళ్ల పడుచు పిల్లలా ఉన్నావ్ అంటూ నటిపై నెటిజన్ కామెంట్.. ఊహించని రిప్లై ఇచ్చిన నటి?

సీనియర్ నటి సుహాసిని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుహాసిని డైరెక్టర్ మణిరత్నంని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించిన సుహాసిని సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తల్లి పాత్రలో నటిస్తూ ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ప్రస్తుతం సుహాసిని హైద్రాబాద్ మోడ్రన్ లవ్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇలా హీరోయిన్ గా నటించి తర్వాత తల్లి పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుహాసిని సోషల్ మీడియాలో కూడా చాలా ఆక్టివ్ గా ఉంటుంది.

సాధారణంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి అభిమానులు నెగిటివ్ పాజిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది సెలబ్రిటీస్ వారి గురించి వచ్చిన నెగటివ్ కామెంట్స్ చూసి ఫుల్ ఫైర్ అవుతుంటారు. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే సుహాసిని తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. సుహాసిని తన సినిమాలు, ప్రాజెక్ట్‌లు, టీవీ షోలకు సంబంధించిన క్యాస్టూమ్స్‌తో ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తుంటారు. తాజగా సుహాసిని కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

సుహాసిని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇలా సుహాసిని షేర్ చేసిన ఫోటోకి ఒక నెటిజన్ ఇచ్చిన కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది. నెటిజన్స్ కామెంట్ చేస్తూ..మీరు చాలా అందంగా.. 16 ఏళ్ల అమ్మాయిలాగా కనిపిస్తున్నారు..లవ్యూ మేడం అంటు కామెంట్ పెట్టాడు. అయితే ఆ కామెంట్ చూసిన సుహాసిని ఎంతో ఫన్నీగా రిప్లై ఇచ్చారు. నెటిజన్ కామెంట్ కి సుహాసిని రిప్లై ఇస్తూ.. హహ అంటూ నవ్వేస్తూ.. జస్ట్ ఆ నంబర్‌ను రివర్స్ చేస్తే అదే నిజం అని తన వయసు 16 కాదు 61 అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ టాపిక్ వైరల్ గా మారింది.