Rashmika: నటి రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే నేషనల్ క్రష్ గా మారి వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రష్మిక దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఏకంగా బాలీవుడ్ చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.
ఇప్పటికే ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ ఫేస్ బుక్ వంటి ఖాతాలలో సుమారు 35 మిలియన్ల ఫాలోవర్స్ ను దక్కించుకున్న శ్రీవల్లి నిత్యం తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రోజురోజుకు అభిమానులను పెంచుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు టచ్ లో ఉంటున్న రష్మిక యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకు మరింత చేరువ కావడం కోసం సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.
రష్మిక మండన్న పేరుతో ఛానెల్ క్రియేట్ చేసినా.. పెద్దగా యాక్టివ్ గా లేదు. కానీ గత కొద్ది రోజులుగా యాక్టివ్ ఉంటూ ఈమె సరదాగా అభిమానులతో లైవ్ చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన రష్మికకు ఒక నెటిజన్ నుంచి అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది.ఈ క్రమంలోనే సదరు నెటిజన్ ప్రశ్నిస్తూ తన ఎంగేజ్మెంట్ బ్రేకప్ కావడానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించారు. ఇలా సదరు నెటిజన్ తన బ్రేకప్ గురించి అడగడంతో రష్మిక ఏం సమాధానం చెప్పాలో దిక్కు తెలియకుండా మౌనంగా ఉండి పోయింది.అయితే రష్మిక మౌనం వెనుక ఉన్న అర్థం ఏమిటి అనే విషయం గురించి ప్రస్తుతం పెద్దఎత్తున చర్చలు జరుపుతున్నారు. ఈమె 2018 లో ‘కిర్రిక్ పార్టీ’ హీరో రక్షిత్ తో నిశ్చితార్థం జరుపుకొని అనంతరం విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం సినిమాలో నటించిన తర్వాత వీరి ఎంగేజ్మెంట్ బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే తన ఎంగేజ్మెంట్ బ్రేకప్ కావడానికి కారణం మాత్రం తెలియలేదు.