నయనతార, విగ్నేష్ జంటకి షాక్ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్… ఆ విషయంలో అసంతృప్తి?

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు తమిళ్ భాషలలో స్టార్ హీరోల సరసన నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్న నయనతార లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ఎక్కువగా నటిస్తూ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందింది. ఇదిలా ఉండగా నయనతార చాలా కాలంగా తమిళ దర్శకుడు విగ్నేశ్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వీరిద్దరూ పెద్దల అంగీకారంతో అతిరథ మహారధుల సమక్షంలో మహాబలిపురంలోని ఒక రిసాట్ లో ఎంతో ఘనంగా వీరి వివాహం జరిగింది.

నయన్,విగ్నేష్ ల వివాహానికి కోలీవుడ్ స్టార్ సెలబ్రిటీలతో పాటు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కూడా హాజరయ్యాడు. అయితే వీరి వివాహం జరిగినప్పటి నుండి వీరికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మరోసారి ఈ జంటకి ఎదురుదెబ్బ తగిలినట్టు సమాచారం. నయన్, విగ్నేష్ పెళ్లి వివాహ వేడుక వీడియో టెలికాస్ట్ చేసే హక్కులని ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సంస్థ రూ.25 కోట్లకు దక్కించుకుంది. సినిమాటిక్ లెవల్ లో వీరి పెళ్ళి వీడియో తీసే బాధ్యతని ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ కి తీసుకున్నారు. అయితే ఇటీవల నయన్, విగ్నేష్ పెళ్లి వీడియో టెలికాస్ట్ చేసే సమయానికి నెట్ ఫ్లిక్ సంస్థ ఒప్పందం రద్దు చేసుకుందని తెలుస్తొంది.

అయితే నెట్ ఫ్లిక్స్ సంస్థ ఇలా చేయటానికి కూడా ఒక కారణం ఉంది. నయన్, విగ్నేష్ వివాహం జరిగి నెల కూడా గడవక ముందే కీలకమైన పెళ్లి ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయంలో నెట్ ఫ్లిక్ సంస్థ తీవ్ర అసంతృప్తితో ఉండటం వల్ల ఒప్పందం రద్దు చేసుకొని నయన్, విగ్నేష్ జంటకు షాక్ ఇచ్చింది. దీంతో ఈ జంట తీవ్ర నిరాశతో ఉన్నట్టు సమాచారం. నయన్, విగ్నేష్ వివాహ వేడుక కోసం హోటల్ బుకింగ్స్, మేకప్ ఆర్టిస్ట్ లు, సెక్యూరిటీ, ఫోటోలు, వీడియోల కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ అధిక మొత్తం ఖర్చుని భరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నయన్ వివాహ వేడుకని టెలికాస్ట్ చేయటం కోసం ఇచ్చిన ఆఫర్ ని నెట్ ఫ్లిక్స్ వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది.