బాహుబలిని చెత్తగా తీశారట.. అందుకే మరో దర్శకుడితో..

netflix

పాన్ ఇండియా సినిమాలకు మొదటి దారి చూపించిన సినిమా బాహుబలి. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆ సినిమా రెండు భాగాలుగా విడుదలై ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి ఇతర దేశాల్లో కూడా టాలీవుడ్ స్థాయిని పెంచిన సినిమా.  అయితే చాలా కాలం తరువాత నెట్ ఫ్లిక్స్ ఆ సినిమా కథకు కొనసాగింపుగా వెబ్ సిరీస్ ను భారీ స్థాయిలో నిర్మించాలని అనుకున్నారు.

bahubali

అసలైతే నెట్ ఫ్లిక్స్ ఇంతవరకు తెలుగులో ఒక్క ప్రాజెక్టును కూడా నిర్మించలేదు. తెలుగు సినిమాలను కూడా ఈ మధ్యనే కొనడం స్టార్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా సినిమాలను సిరీస్ లను నిర్మించే నెట్ ఫ్లిక్స్ మొదటిసారి బాహుబలిని వాడుకోవాలని అనుకుంది. వెబ్ సిరీస్ ను రూపొందించడానికి తెలుగు డైరెక్టర్స్ దేవాకట్టా, ప్రవీణ్ సత్తారును కూడా ఫైనల్ చేశారు. అయితే ఆ సిరీస్ పనులు మొదలై ఏడాది అయినప్పటికీ ఇంకా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇక దాదాపు పూర్తయ్యిందని అనుకున్న తరుణంలో నెట్ ఫ్లిక్స్ సంస్థ వారి పనితనాన్ని ఏ మాత్రం మెచ్చుకోలేదట.

వారి మేకింగ్ ఏ మాత్రం నచ్చక మొత్తం పక్కన పడేశారట. ఇక దాదాపు ఆగిపోయిందని అనుకుంటున్న తరుణంలో మళ్ళీ మరో దర్శకుడిని లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. విశ్వేష్ కృష్ణ‌మూర్తి అనే త‌మిళ దర్శకుడిని ఫైనల్ చేసినట్లు టాక్. ఈ యంగ్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్ 99 సాంగ్స్‌తో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేయ‌నున్నాడు. ఆ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాకపోయినా కూడా ఆ యువ దర్శకుడి టాలెంట్ గురించి తెలుసుకొని బాహుబలి వెబ్ సిరీస్ ని అతని చేతిలో పెడుతున్నారట. మరి ఆ దర్శకుడు ఎంతవరకు న్యాయం చేస్తాడో చూడాలి.