భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన లేడి సూపర్ స్టార్… ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో అనేక భాషలలో స్టార్ హీరోల సరిగా నటించి తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నయనతార ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నయనతారకి తన అభిమానులు ముద్దుగా లేడీస్ సూపర్ స్టార్ అంటూ బిరుదిచ్చారు. ఇటీవల తన ప్రేమికుడు ప్రముఖ తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంబించింది. వివాహం తర్వాత కొంతకాలం కలసి ఎంజాయ్ చేసిన ఈ జంట ప్రస్తుతం షూటింగ్ పనులలో బిజిగా ఉన్నారు.

ఇక నయనతార షారుఖ్ ఖాన్ సినిమాలో నటిస్తూ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనిలో నయనతార బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల నయనతార గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా నిలిచిన నయనతార వివాహం తర్వాత తన రెమ్యూనరేషన్ మరింత పెంచి నిర్మాతలకు షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు అత్యధికంగా ఏడు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్న నయనతార ప్రస్తుతం ఒక సినిమా కోసం పది కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

అయినప్పటికీ నిర్మాతలు నయనతార కోసం ఎగబడుతున్నారు. అంతే కాకుండా వివాహం తర్వత సినిమాలకి దూరమవుతుంది అనుకున్న అభిమానులకు నయనతార మళ్ళీ సినిమాలలో నటిస్తూ గుడ్ న్యూస్ చెప్పింది. కాకపోతే నిర్మాతలకి చాలా కండీషన్లు పెట్టింది. ఇప్పటికే సినిమా ప్రమోషన్ భాద్యతలను నిర్మాతలకి వదిలేసిన నయన్ ఇక వివాహం తర్వత పొట్టి బట్టలు వేసుకోనని, గ్లామర్ పాత్రలలో నటించనని కండిషన్ పెట్టింది. అంతే కాకుండా ఈప్పుడు తన రెమ్యునరేషన్ కూడా దాదాపు 3 కోట్లు పెంచి నిర్మాతలకి షాక్ ఇచ్చింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.