నయనతార పబ్లిసిటీ స్టంట్స్ ఇలాగే వుంటాయ్.!

ఏంటీ, నయనతార – విఘ్నేష్ శివన్ విడిపోయారా.? అంతా అవాక్కయ్యారు ఇటీవల సోషల్ మీడియా వేదికగా జరిగిన రచ్చ నేపథ్యంలో. విఘ్నేష్ శివన్‌ని నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో చేసిందన్న ప్రచారంతో మొదలైంది ఆ రచ్చ.

నయనతార – విఘ్నేష్ శివన్ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళికి ముందు చాన్నాళ్ళు సహజీవనం కూడా చేశారు. అనధికారిక పెళ్ళి, అధికారిక పెళ్ళి.. రెండూ జరిగాయ్. ఇద్దరికీ కవలలు జన్మించారు కూడా.

కవలలు జన్మించాకే, పెళ్ళి.. అంతకు ముందే జరిగిందనీ.. అధికారికంగా అందరికీ తెలిసేలా ఇంకోసారి చేసుకున్నారనీ తేటతెల్లమయ్యింది.. అదంతా వేరే చర్చ.

విఘ్నేష్ – నయనతార.. ఇద్దరి ఫొటోలూ తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వుంటాయి. విఘ్నేష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటాడు. నయనతార చాలా తక్కువ. సినిమాలు, ఆపై సొంత వ్యాపారాలు.. ఈ నేపథ్యంలో నయనతార సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ అయ్యింది.

ఏదో టెక్నికల్ ఇష్యూ కారణంగా నయనతార, తన భర్త విఘ్నేష్ వివన్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో అయినట్లు కనిపించిందన్నది పెద్ద రచ్చ అనంతరం బయటకు వచ్చిన విషయం. అయితే, ఇది కూడా ఓ పబ్లిసిటీ స్టంటే కావొచ్చని తమిళ సినీ జనాలు అంటున్నారు.

లేడీ సూపర్ స్టార్ నయనతార ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ చేయడంలో దిట్ట అనీ, ఈ తరహా పబ్లిసిటీ స్టంట్స్‌తోనే నయనతార తన స్టార్‌డమ్ పెంచుకుంటోందనీ.. తమిళ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు.