నవదీప్-విష్ణు ప్రియ కథలు.. ఇలా మరోసారి బయటపడింది!!

టాలీవుడ్‌లో మరో కొత్త కహానీ ఈ మధ్య బయటపడింది. నవదీప్ హ్యాండ్సమ్ హీరో అని చెప్పడం వరకు ఓకే, హీరో కాబట్టి ఐ లవ్యూ అని చెప్పడం కూడా ఓకే. ఇవన్నీ సాధారణ జనాలు చెబితే ఎవ్వరూ అంతగా పట్టించుకోరు. కానీ అది ఓ యాంకర్.. సెలెబ్రిటీ స్టేటస్ వచ్చిన ఓ లేడీ యాంకర్ అలా చెబితే.. ఇంకేమైనా ఉంటుందా?. ప్రస్తుతం అదే జరుగుతోంది. శ్రీముఖి వల్ల విష్ణుప్రియ భండారం బయటపడింది.

Navdeep And Vishnu Priya Relation Goes Viral
Navdeep And Vishnu Priya Relation Goes Viral

విష్ణుప్రియకు నవదీప్ అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఎన్నో ఇంటర్వ్యూల్లోకూడా చెప్పిందట. ఇక్కడి వరకు వ్యవహారం బాగానే ఉంది. కానీ విష్ణు ప్రియ నవదీప్ ఇంటికి వెళ్లడం, కలిసి డిన్నర్లు చేయడం వంటి విషయాలను శ్రీముఖి బయట పెట్టేసింది. దీంతో విష్ణు ప్రియ వ్యవహారం బయటకు వచ్చింది. ఇంకా ముందుకు వెళ్లి ఏదో చెప్పబోతోన్న శ్రీముఖికి అడ్డుకట్ట వేసింది విష్ణు ప్రియ. అయితే మరోసారి వీరిద్దరి మధ్య ఉన్న ఇష్యూ హాట్ టాపిక్ అవుతోంది.

Navdeep And Vishnu Priya Relation Goes Viral
Navdeep And Vishnu Priya Relation Goes Viral

తాజాగా నవదీప్ తన గ్యాంగ్‌తో కలిసి హిమాలయాలకు వెళ్లాడు. అది కూడా రోడ్ ట్రిప్. అది కూడా బైక్ మీద. ఇలా వెళ్లడం ఎంతో సంతోషంగా ఉందంటూ తన అనందాన్ని వ్యక్తం చేశాడు. ఇదేమీ మొదటి సారి కాదని ఇలా మూడు సార్లు వెళ్లానని కూడా చెప్పాడు. అయితే నవదీప్ చేసిన ఈ పోస్ట్‌కు విష్ణు ప్రియ కొన్ని పదుల సంఖ్యలో లవ్ సింబల్స్‌లతో రిప్లై ఇచ్చింది. ఎంత ప్రేమ లేకపోతే అన్ని లవ్ సింబల్స్ పంపిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.