తెలియని వాటి గురించి మాట్లాడకండి.. నవదీప్‌ పోస్ట్ అర్థం అదేనా?

Navdeep About Fake News on Rakul Preet to Drugs

ప్రస్తుతం నవదీప్ వార్తల్లో నిలుస్తున్నాడు. డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ పేరు బయటకు రావడంతో అంతా రచ్చ రచ్చ అయింది. ఇక డ్రగ్స్ కేసు బాలీవుడ్ టు టాలీవుడ్ కూడా వస్తోందని అంతా భయపడ్డారు. రకుల్ ప్రీత్ పేరు బయటకు రావడంతోనే మంచు లక్ష్మీ రానా నవదీప్ వంటి పేర్లు కూడా సోషల్ మీడియాలో చర్చకొచ్చాయి. ఈ క్రమంలోనే నెటిజన్లు చేసిన కామెంట్లకు నవదీప్ కూడా సమాధానమిచ్చాడు.

 Navdeep About Fake News on Rakul Preet to Drugs

Navdeep About Fake News on Rakul Preet to Drugs

అంతకు ముందు కూడా నవదీప్ డ్రగ్స్ కోరల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆనాడు టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ డ్రగ్స్ కేసులో చిక్కుకుని ఉండగా.. ఆ మచ్చ మాత్రం ఇంకా పోవడంలేదు, తాజాగా రకుల్ పేరు బయటకు రావడంతో మళ్లీ అవన్నీ చర్చకు వచ్చాయి. ఇక నవదీప్ పేరు తీస్తూ ఓ నెటిజన్ కామెంట్ కూడా చేశాడు. నవదీప్ ఇప్పుడు జాగ్ర్తతగా ఉండాలేమో.. ఏంటి ఈ బాధలు అంటూ ఓ సెటైర్ వేశాడు. ఆ కామెంట్‌కు నవదీప్ రియాక్ట్ అవుతూ.. తనకేమీ బాధలేదని, పనికొచ్చే పనులు చేద్దాం పదా అంటూ ఓ కౌంటర్ వేశాడు.

తాజాగా నవదీప్ మరో కామెంట్ చేశాడు. మనుషులమైన మనం.. మనకు పూర్తిగా తెలియని వాటి గురించి మాట్లాడకూడుదు. నాకు అలా అనిపిస్తోంది.. అవును అదే నిజమై ఉంటుంది.. నేనూ అదే అనుకుంటున్నాను.. నాకు అదే నిజమని అనిపిస్తోంది.. అలా జరుగుతుందని నాకు తెలుసు అనే ఇలాంటి మాటలు మాట్లాడకండి.. నాన్నా నోస్ట్రాదాముస్ కంగారు కైకూరే అంటూ ఓ సెటైర్ వేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై నవదీప్ ఈ సెటైర్ వేసి ఉంటాడని తెలుస్తోంది.

 Navdeep About Fake News on Rakul Preet to Drugs

Navdeep About Fake News on Rakul Preet to Drugs