RRR Movie: యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్న నాటు నాటు సాంగ్…!

RRR Movie: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం RRR.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది అయితే ఈ సినిమాని వచ్చే నెల 25వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్ పాటలు ప్రతి ఒక్క ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రికార్డులు సృష్టిస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నాటు నాటు పాట సోషల్ మీడియాను షేక్ చేసిందని చెప్పాలి.ఈ పాట విడుదలై దాదాపు మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఈ పాట ఇప్పటికే ఏకంగా 200 మిలియన్ వ్యూస్ దక్కించుకొని సరికొత్త రికార్డును సృష్టించింది.

ఇకపోతే ఈ సినిమా వచ్చే నెల 25వ తేదీన విడుదల చేయాలని చిత్రబృందం భావించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఇప్పటికే ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. జనవరి 7వ తేదీ ఈ సినిమా విడుదల అవుతుందని చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో మార్చి 25వ తేదీ ఈ సినిమా విడుదల చేయాలని చిత్రబృందం భావించగా మరోసారి ప్రమోషన్ కార్యక్రమాలను చిత్రబృందం వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది.