ఈ మధ్య సెన్సేషనల్ జంటగా జనాల నోళ్లలో తెగ నానిపోయారు నరేష్ – పవిత్ర లోకేష్. ఓ హోటల్ రూమ్‌లో అడ్డంగా బుక్కయిపోయిన ఈ జంట అక్కడి నుంచి పబ్లిసిటీ కోసం చేస్తున్న చిందులు అన్నీ ఇన్నీ కావు.
ఇక, అన్నింటికీ మించి ఈ జంట ప్రధాన పాత్రల్లో సినిమా తెరకెక్కడం నెక్స్‌ట్ లెవల్ పైత్యమే అని చెప్పాలి. ‘మళ్లీ పెళ్లి’ అనే టైటిల్‌తో నరేష్ – పవిత్రా లోకేష్ జంటగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం పబ్లిసిటీ ఏర్పాట్లు అలా ఇలా చేయట్లేదంట నరేష్.
సినిమాలో కంటెంట్ సంగతెలా వున్నా ప్రమోషన్స్ మాత్రం వేరే లెవల్‌లో చేయాలని డిసైడ్ అయ్యాడట. తెలుగు స్టేట్స్‌లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ తిరిగేస్తారట ప్రమోషన్లలో భాగంగా.. ఓ పెద్ద సినిమాకి ఎలా డిజైన్ చేస్తారో అలా ఈ సినిమాకి ప్రమోషన్లు డిజైన్ చేస్తారట. వేరే లాంగ్వేజెస్‌లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేసే యోచనలో వున్నాడట నరేష్.
సినిమా ఇండస్ట్రీలో అంతా నవ్వుకుంటున్నారు నరేష్ పైత్యం చూసి. కానీ, నరేష్ మాత్రం ‘ఎవరేమనుకున్నా డోంట్ కేర్..! నేను చేయాల్సిందే నేను చేస్తా.. అంటున్నాడట.