కొత్త గర్ల్ ఫ్రెండ్ మోజులో పడి పవిత్రను దూరం పెట్టిన నరేష్..?రూ. 50 కోట్లు డిమాండ్ చేస్తున్న పవిత్ర..!

నటుడు వి కె నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ వ్యవహారం గతంలో ఇండస్ట్రీలో సంచలనం రేపింది. చాలాకాలంగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరి బండారం నరేష్ మూడో భార్య సీన్ లోకి ఎంటర్ అవటంతో బయటపడింది. గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న నరేష్ పవిత్ర లోకేష్ ఇటీవల వారి మధ్య ఉన్న బంధాన్ని మీడియా వేదికగా అంగీకరించారు. వారిద్దరూ నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు ఈ విషయం కృష్ణ కుటుంబానికి కూడా తెలుసునని పవిత్ర వెల్లడించింది. మరొకవైపు నరేష్ కూడా పవిత్రతో సహజీవనం చేస్తున్నట్లు అంగీకరించారు.

అయితే వీరిద్దరూ అగ్రిమెంట్ ప్రకారం సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నెలకు రూ. 25 లక్షలు పవిత్రకు చెల్లించేలా నరేష్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. ఒకవేళ నరేష్ పవిత్రకు దూరంగా ఉండాలనుకుంటే ఆమెకు రూ. 50 కోట్లు చెల్లించేలా అగ్రిమెంట్ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం అగ్రిమెంట్ ప్రకారం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు దీంతో నరేష్ నెలకు పాతిక లక్షలు పవిత్రకు చెల్లించాడు.

అయితే వీరి విషయం బట్టబయలు కావటంతో నరేష్ పవిత్రని దూరంగా పెట్టి మరొక పాత హీరోయిన్ మోజులో పడ్డట్టు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నరేష్ దూరం పెట్టడం వల్ల తనని మధ్యలో వదిలేసినందుకు అగ్రిమెంట్ ప్రకారం రూ. 50 కోట్లు చెల్లించాలని లేదంటే నరేష్ బండారం మొత్తం బయట పెట్టి పరువు తీస్తానని పవిత్ర నరేష్ ని బెదిరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నరేష్ పవిత్ర బెదిరింపులకు భయపడకుండా 50 కోట్లు చెల్లించేది లేదని కావాలంటే 50 లక్షలు రూపాయలు చెల్లిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరి వ్యవహారం ఎంతవరకు వెళుతుందో చూడాలి మరి.