గత కొన్నాళ్ల నుంచి టాలీవుడ్ సినిమా దగ్గర ఓ రేంజ్ లో హాట్ టాపిక్ కా కాంట్రవర్సీగా మారిన అంశాల్లో సీనియర్ నటుడు నరేష్ అలాగే ప్రముఖ నటి పవిత్ర లోకేష్ ల రిలేషన్ కూడా ఒకటి అని తెలిసిందే. అయితే వీరి సరికొత్త ప్రేమ కథ ఊహించని లెవెల్లో అనేక మలుపులు తిరుగుతూ ఓ షాకింగ్ వీడియో వరకు కూడా వచ్చింది.
అయితే ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమానే “మళ్ళీ పెళ్లి” కాగా ఈ సినిమాకి కావాల్సినంత హైప్ అంత ఇది వరకే వచ్చేసింది. కాగా ఈ సినిమా కోసం నరేష్ పవిత్రల లిప్ లాక్ వీడియో తర్వాత పెళ్ళికి రెడీ అన్నట్టుగా పోస్టర్ లు ఆసక్తి రేపగా తర్వాత ఇవన్నీ సినిమా కోసమే అని కన్ఫర్మ్ అయ్యింది.
అయితే ఇపుడు మేకర్స్ ఈ సినిమా తాలూకా టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ అయితే జెనరల్ సినిమాలనే ఉంటుంది అనుకుంటే పొరపాటే ఇది నరేష్ జీవిత చరిత్రలా కనిపిస్తుంది. తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి తన మొదటి భార్య ని వదిలేసి పవిత్ర లోకేష్ తో ఎలా సెట్ అవ్వాల్సి వచ్చింది అనేవి క్లియర్ గా చూపించడం ఆశ్చర్యకరం.
అంతే కాకుండా ఇందులో కూడా లిప్ లాక్ పెట్టడం నరేష్ పవిత్ర ల మధ్య మరింత రొమాంటిక్ సీన్స్ చూపించడం మరో హైలైట్. ఇంతేనా నరేష్ ని పవిత్ర ని నిజ జీవితంలో తన ముందు భార్య ఓ హోటల్లో పట్టుకున్నపుడు నరేష్ విజిల్ వేసుకుంటూ మరీ వెళ్ళిపోయిన సీన్ ని ఈ సినిమాల్లో కూడా రీ క్రియేట్ చేయడం అనేవి ఆడియెన్స్ కి పేరడీ ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చేలా ఉన్నాయనిపిస్తోంది. ఇక ఇద్దరి మధ్య లాస్ట్ షాట్ కోసం చెప్పక్కర్లేదు.. మొత్తానికి అయితే టీజర్ తో క్లారిటీ ఇచ్చారు.