హీరోయిన్ మోజులో పడిన నరేశ్.. మరి పవిత్ర బంధం ముగిసినట్టేనా?

స్టార్ హీరో కృష్ణ తనయుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నరేష్ గురించి తెలియని వారంటున్నారు. జంబలకడిపంబ సినిమాలో హీరోగా నటించి మంచి గుర్తింపు పొందిన నరేష్ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు పొందాడు. ఇక కొంతకాలంగా నరేష్ పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో మారు మోగుతోంది. లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో నరేష్ కి ఉన్న సాన్నిహిత్యం వల్ల వీరిద్దరూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు ఇటీవల వీరే స్వయంగా ప్రకటించారు.

నరేష్ కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలలో పవిత్ర లోకేష్ కనిపించడంతోపాటు ఎక్కడికి వెళ్లినా వీరిద్దరూ జంటగా వెళ్లడంతో తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో నరేష్ మూడో భార్య రమ్య సీన్ లోకి ఎంటర్ అయి నాకు విడాకులు ఇవ్వకుండా తనని ఎలా పెళ్లి చేసుకుంటారు అంటూ రచ్చ చేసి వారి బండారాన్ని బయట పెట్టింది. ఈ క్రమంలో వీరిద్దరూ నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు అంగీకరించారు. అది కూడా వీరిద్దరూ ఒక అగ్రిమెంట్ ప్రకారం సహజీవనం చేస్తున్నారని సమాచారం. తనతో సహజీవనం చేస్తున్నందుకు నరేష్ ప్రతినెల పవిత్ర కి పాతిక లక్షలు భరణం ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ నరేష్ పవిత్రని వదిలేస్తే రూ. 50 కోట్లు చెల్లించవలసిందిగా అగ్రిమెంట్ రాసుకున్నట్లు సమాచారం.

ఇక ఇటీవల వీరిద్దరి సహజీవనం విషయం వివాదంగా మారటంతో కొన్ని రోజులుగా వీరిద్దరూ ఎక్కడా జంటగా కనిపించడం లేదు. దీంతో నరేష్ మరొక సీనియర్ హీరోయిన్ మోజులో పడి పవిత్రని దూరం పెడుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తనని నిర్లక్ష్యం చేసినందుకు పవిత్ర కూడా నరేష్ ని రూ. 50 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నరేష్ మాత్రం పవిత్రని పట్టించుకోకుండా ఆమెకు 50 కోట్లు ఇవ్వటానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఇంతకాలం నరేష్ ఎంతో మంచివాడని పొగిడిన పవిత్ర ఇప్పుడు అతని చేతిలోనే మోసపోయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంటుంది.