కొద్ది రోజుల క్రితం కేజీఎఫ్ సినిమాని ఉద్దేశిస్తూ దర్శకుడు వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ సినిమాలో ప్రధాన పాత్రధారి యశ్ పాత్రను ఎద్దేవా చేస్తూ వాడొక నీచ్ కమినే కుత్తే అంటూ దారుణమైన విధంగా వెంకటేష్ మహా కామెంట్లు చేయడం ఆ తర్వాత తన అభిప్రాయం కరెక్టే గాని చెప్పిన విధానం కరెక్ట్ కాదంటూ… ఆ విధానం విషయంలో ఆయన క్షమాపణలు కూడా చెప్పారు . అయితే అటు తెలుగు అభిమానులు… ఇటు కన్నడ అభిమానులు సైతం వెంకటేష్ మహా మీద తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆ వివాదం కాస్త సద్దుమణిగింది.
ఈ సమయంలో హీరో నాని వెంకటేష్ మహాకి కౌంటర్ ఇస్తున్నట్లుగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా అనే సినిమా రూపొందింది. మరికొద్ది రోజులలో ప్రేక్షకుల ముందు రాకపోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో నాని పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ… కమర్షియల్ సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఈ వ్యాఖ్యలు నాని… వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గానే చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కమర్షియల్ సినిమాల వల్లే మన ఇండియన్ సినిమా ఉన్నతంగా నిలుస్తుందని నాని కామెంట్ చేశారు. కమర్షియల్ సినిమాలు లేకపోతే ఇండస్ట్రీలో డబ్బు, వసూళ్లు ఉండవని నాని అన్నారు. మన దగ్గర అలాంటి సినిమాలు లేకుంటే ఎవరైనా మంచి సినిమాలు తీయడానికి సాహసించగలరు? అలాంటి సినిమాలు లేకుంటే థియేటర్లకు ఎవరూ రారు కదా అని ఆయన అన్నారు. మాస్, కమర్షియల్ చిత్రాలే భారతీయ సినిమాకు వెన్నెముక, మూల స్తంభాలు అని నాని అన్నారు.
ఇక్కడ నాని వెంకటేష్ మహా పేరు ప్రస్తావించకపోయిన కమర్షియల్ సినిమాల మీద వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గానే నాని ఈ మేరకు కామెంట్లు చేశారని నెటిజన్లంతా చర్చించుకుంటున్నారు. మరి వెంకటేష్ మహా ఈ విషయం మీద ఎలా స్పందిస్తాడో చూడాలి.