భార్యాభర్తల మధ్య గొడవ అంటే.. ఎవరా భార్యాభర్తలు.. ఎందుకు రష్మీ వాళ్ల మధ్య చిచ్చు పెట్టింది అనేగా మీ డౌటనుమానం. ఇక్కడ భార్యాభర్తలు అంటే నందు, గీతామాధురి. అది ఓకే కానీ.. వాళ్లిద్దరి మధ్య రష్మీ ఏం చిచ్చు పెట్టింది అనేగా మీ డౌట్.
అసలు విషయం ఏంటంటే.. నందు, రష్మీ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు తెలుసు కదా. అదేనండి.. బొమ్మ బ్లాక్ బస్టర్. ఆ సినిమాలో వీళ్లిద్దరు మెయిల్ రోల్స్ చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ కూడా విడుదలై మంచి టాక్ నే సంపాదించుకున్నాయి.
అయితే.. ఆ సినిమాలో రష్మీ, నందు మధ్య కెమెస్ట్రీ కొంచెం ఎక్కువైందని.. అది చూసి గీతా మాధురి.. నందును తిట్టిందని.. భార్యాభర్తల మధ్య గొడవపెట్టిన యాంకర్ రష్మీ.. అంటూ ఓ యూట్యూబ్ చానెల్ లో ఓ వీడియోను పెట్టారు.
ఆ వీడియో నందు కంట పడింది. నందు అన్ని విషయాలను చాలా సరదాగా తీసుకుంటాడు. అందుకే.. ఆ యూట్యూబ్ వీడియో థంబ్ నెయిల్ స్క్రీన్ షాట్ తీసి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసి.. మీ బొందరా మీ బొంద.. గీతామాధురి.. హాహాహా.. ఇది చూశావా? ఇప్పుడు ఈ యూట్యూబ్ చానెల్ కోసం మనం గొడవ పడాలి అనుకుంటా.. అంటూ క్యాప్షన్ పెట్టి గీతామాధురిని ట్యాగ్ చేశాడు.
దానికి స్పందించిన గీతా మాధురి… హహహ.. చూశా బుజ్జి… కరోనా కి అయినా వాక్సిన్ వస్తుందేమో కానీ.. ఈ థంబ్ నెయిల్ ఫెలోస్ మాత్రం చేంజ్ అవరు.. బైదవే.. మనం గొడవ పడ్డాం కదా.. అంటూ మరో సెటైరికల్ క్యాప్షన్ పెట్టింది గీతా.
ఇక.. వీళ్ల మధ్యలో దూరిన యాంకర్ రష్మీ.. ఈ యూట్యూబ్ చానెళ్ల వాళ్ల బాధ ఏంటో? అంటూ కామెంట్లు పెడుతోంది. మొత్తానికి ఈ వ్యవహారం మొత్తం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటువంటి పుకార్లను చాలా సరదాగా తీసుకున్న నందు, గీతామాధురిలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.