ఇన్నాళ్లూ ఇంత అందాన్ని ఎక్కడ దాచిపెట్టావ్.. ఫోటో షూట్లతో నందినీ రాయ్ రచ్చ!!

నందినీ రాయ్ సినిమాల కంటే బిగ్ బాస్ ద్వారానే ఫేమస్ అయింది. వెండితెరపై అడపాదడపా చిత్రాలు చేసినా గానీ అంతగా ఫేమస్ కాలేకపోయింది. సుధీర్ బాబు మోసగాళ్లకు మోసగాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది గానీ పేరు మాత్రం సంపాదించుకోలేకపోయింది. బిగ్ బాస్ రెండో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం తనీష్‌తో రహస్య బంధాన్ని కొనసాగించడం, కాస్త యాక్టివ్‌గా ఉండటంతో క్లిక్ అయింద.ి

Nandini Rai Latest Photoshoot Goes Viral
Nandini Rai Latest Photoshoot Goes Viral

ఇక ఆ మద్య హలో యాప్‌లో ఇంటర్వ్యూ ఇస్తూ మీటూ, టాలీవుడ్‌పై సంచలన కామెంట్స్ చేసింది. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రతీ ఇండస్ట్రీలో ఉంటుందని, అయితే అది మన మీదే ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చింది. మన అంగీకారం లేకుండా ఏది జరగదని, తనకైతే ఇంత వరకు అలాంటి అనుభవం ఎదురుకాలేదని చెప్పుకొచ్చింది. అయితే రీసెంట్‌గా నందినీ రాయ్ మెట్రో కథలు అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కాగా.. నందినీ రాయ్‌కి మంచిపేరు వచ్చింది.

Nandini Rai Latest Photoshoot Goes Viral
Nandini Rai Latest Photoshoot Goes Viral

మెట్రో కథలు సినిమాలో నందినీ రాయ్ వేశ్యగా నటించి అందర్నీ మెప్పించింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ అందరికీ తెలిసిందే హాట్ హాట్ ఫోటో షూట్లతో నానా రచ్చ చేస్తుంది. అందాల ఆరబోతలో నందినీ రాయ్ ప్రత్యేకంగా నిలుస్తుంది. మోడ్రన్ డ్రెస్సులు వేసినా చీరకట్టులో మెరిసినా నందినీ పిక్స్ మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. తాజాగా నందినీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట మంట పుట్టిస్తున్నాయి.