కళ్యాణ్ రామ్, బాలయ్య కాంబినేషన్‌లో.!

నందమూరి బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ కలిసి చాలాకాలం క్రితం ఓ సినిమాలో నటించారట. ఆ విషయాన్ని తరచూ చెబుతుంటాడు కళ్యాణ్ రామ్. వాస్తవానికి అది కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా వున్నప్పటి చిత్రం. అయితే, ఇప్పుడు కళ్యాణ్ రామ్ హీరో. హీరో అయ్యాకా వీరిద్దరి కాంబినేషన్ తెరపై చూడలేదింతవరకూ.

త్వరలో ఆ ముచ్చట తీరబోతోందట. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనుందనీ తాజా సమాచారం. ఎన్టీయార్ ఆర్ట్స్ పతాకంపైనే ఈ సినిమా వుండబోతోందనీ అనుకుంటున్నారు.

కొత్త దర్శకులను ఎప్పుడూ ఎంకరేజ్ చేసే కళ్యాణ్ రామ్.. బాబాయ్‌తో చేయబోయే ఈ సరికొత్త సినిమాకీ ఓ కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇవ్వబోతున్నాడనీ సమాచారం.

అయితే, పూర్తి స్థాయి మల్టీ స్టారర్ మూవీ కాదట ఇది. కేవలం 40 నిమిషాల నిడివి మాత్రమే బాలయ్య పాత్ర వుంటుందట. ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ అని అంటున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ తరహా కథ అని ప్రచారం జరుగుతోంది.