మళ్లీ ఫోన్ విసిరి పారేశాడు.. బాలయ్య కోపానికి కారణం అదేనా?

నందమూరి బాలకృష్ణ మీడియా ముందుకు వస్తే ఆరోజంతా వార్తలకు కొదవే ఉండద. బాలయ్య ఆవేశానికి లోనవ్వడానికి అక్కడ పుష్కలైన సందర్భాలు తారపడతాయి. నిన్నటి సెహరి పోస్టర్ లాంచ్ ఈవెంట్‌లోనూ బాలయ్య ఆగ్రహానికి లోనయ్యాడు. చాలా విషయాల్లో బాలయ్య ఫైర్ అయ్యాడు. అందరి మీద అసహనం ప్రదర్శించాడు. అందులో ఓ సారి బాలయ్య తన ఫోన్‌ను విసిరి అవతల పారేశాడు. అది చూసి అక్కడి వారంతా షాక్ అయ్యారు.

Nandamuri Balakrishna Throws Phone At Sehari Event
Nandamuri Balakrishna Throws Phone at Sehari Event

మామూలుగా బాలయ్య ఎదుటి వారి ఫోన్ తీసి పగలగొడతాడు. పబ్లిక్ ఫంక్షన్లలో బాలయ్య రావడం, అభిమానులు సెల్ఫీ కోసం ఎగబడటం వంటివి జరుగుతుంటాయి. కోపంలో బాలయ్య ఆ ఫోన్‌లను నేలకు విసిరి కొట్టడం వంటివి చేస్తుంటాడు. కానీ నిన్నటి ఈవెంట్‌లో బాలయ్య మాత్రం తన ఫోన్‌నే విసిరి పాడేశాడు. అప్పటికే స్టేజ్ నిల్చుని విసుగు చెందడం, యాంకర్మ కూడా వయసు మీద ఏదో కామెంట్ చేయడం ఇలా పలు రకాల ఆలోచనలో మధ్యలో ఫోన్ రావడంతో పీఏ మీదకు ఫోన్ విసిరినట్టు తెలుస్తోంది.

Nandamuri Balakrishna Throws Phone At Sehari Event
Nandamuri Balakrishna Throws Phone at Sehari Event

ఇక పోస్టర్ లాంచ్ సమయంలోనూ దాన్ని ఖండఖండాలుగా చించే పారేశాడు. ఓ అడ్డూ అదుపు లేకుండా ఏదో చేసేయాలన్నట్టుగా చేశాడు. పోస్టర్‌ను రివీల్ చేసే సమయంలో పక్కనున్న హీరోయిన్‌కు అది తాకుతున్నా పట్టించుకోవడం లేదు. బాలయ్య దూకుడుని చూసి హీరోయిన్ కూడా కాస్త దూరంగా నిలబడింది. ఇక పక్కనున్న ఇంకో వ్యక్తి పోస్టర్ మీద చేయి వేస్తుంటే విదిల్చి అవతల పారేశాడు. ఇవన్నీ ఒకెత్తు అయితే కరోనాపై బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇంకో ఎత్తు. వ్యాక్సిన్ లేదు.. రాదు అని బాలయ్య సంచలన కామెంట్స్ చేశాడు.

 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles