ఏడాది కిందట జరిగిన ఒక సంఘటనకు సంబంధించి బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ క్షమాపణలు తెలిపాడు. నానా పటేకర్ ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా చిత్రం వన్‌వాస్. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. నానాజీ.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన గత ఏడాది ఈ సినిమా షూటింగ్‌లో జరిగిన సంఘటనపై క్షమాపణలు తెలిపాడు. కాశీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. నానా పటేకర్ దగ్గరికి వచ్చి ఓ అభిమాని సెల్ఫీ దిగాలని చూస్తాడు. దీంతో అసహనానికి గురైన నానా యువకుడి తలపై గట్టిగా కొట్టారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నానాపటేకర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.
తాజాగా ఈ విషయంపై స్పందించిన నానా జరిగిన ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. యువకుడికి క్షమాపణలు చెప్పారు. ఆరోజు నేను షూటింగ్‌లో ఉన్నాను. అందరూ షూటింగ్‌లో ఉండగా.. అతడు వచ్చి ఫొటో తీసుకుంటుంటే కోపంతో కొట్టాను. అది వివాదం అయ్యింది. అతడు షూటింగ్ టైంలో కాకుండా సాధరణ టైంలో వచ్చి ఉంటే ఫొటో ఇచ్చేవాడిని అంటూ నానా చెప్పుకొచ్చాడు.