కరోనా మహమ్మారి చాలా మందికి జ్ఞానోదయం కలిగించింది. ఈ మహమ్మారికి ముందు కూడా తినే తిండి విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తూ వచ్చారు సెలబ్రిటీలు. ఇక ఇప్పుడైతే సొంతంగా ఇంట్లోనో లేదంటే ఫాం హౌజ్ లోనో కూరగాయలు పండిస్తూ వాటిని ఆరగిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా పండిన పంటలు ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం అంటూ సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్, పవన్ కళ్యాణ్, సమంత వంటి వారు స్వయంగా కూరగాయలు పండించుకుంటుండగా, తాజాగా ఈ లిస్ట్ లో నమ్రత చేరింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ తన ఫామ్ హౌజ్‌లో మిర్చి, టమాటాతో పాటు పత్తి కూడా పండిస్తుందట. రసాయనాలు వాడుకుండా సాగు చేస్తున్నట్టు తన సోషల్ మీడియాలో తెలియజేసిన నమత్ర మనం పండించుకునే కూరగాయల మాదిరిగా ఏవి ఉండవు అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేసింది. ప్రస్తుతం నమ్రత షేర్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. కరోనా వలన మహేష్ ఫ్యామిలీ దాదాపు 8 నెలల పాటు ఇంటికే పరిమితం కాగా, ఇప్పుడిప్పుడే విహార యాత్రలు, షూటింగ్స్ అని బయట అడుగుపెడుతున్నారు.
కొద్ది రోజులు క్రితం ఫ్యామిలీ అంతా దుబాయ్ టూర్ వేయగా, ఆ తర్వాత ముంబై వెళ్ళారు. మధ్యలో సర్కారు వారి పాట చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించింది నమ్రత. జనవరి నుండి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుండగా, ఏడాదిలోనే చిత్రీకరణ పూర్తి చేసి సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ..రాజమౌళితో ఓ చిత్రం, వంశీ పైడిపల్లితో ఓ చిత్రం చేయనున్నాడు.