నాగశౌర్య సతీమణి అనూష శెట్టి పేరుపై ఉన్న ఆస్తులు విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిల వివాహం బెంగళూరులో తమ నివాసంలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే.అనుష ఫ్యామిలీ బిజినెస్ రంగంలో ఎన్నో ఏళ్ల కిందటే బెంగళూరులో స్థిరపడ్డారని తెలుస్తోంది. నాగశౌర్య అనూష వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమా లేక ప్రేమా వివాహమా అన్న సందేహం చాలామందిలో కలుగుతున్నప్పటికీ దీనిపై ఎటువంటి సమాచారం లేదు. ఏది ఏమైనప్పటికీ హీరో నాగశౌర్య అనూష శెట్టి జంట అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

నాగశౌర్య అనూష శెట్టి వివాహం కుటుంబ సభ్యుల మధ్య బెంగళూరులో జరిగింది కావున త్వరలోనే హైదరాబాదులో ఎంతో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే నాగశౌర్య భార్య అనూష ఆస్తి గురించి సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంతోకాలంగా బిజినెస్ రంగంలో స్థిరపడిన అనూష ఫ్యామిలీ బాగానే ఆస్తులు ఉన్నాయని వాటిలో సగభాగం వివాహ కానుకగా నాగశౌర్య పేరు మిదకు మార్చబోతున్నారట. ఇలా దాదాపు 60 కోట్ల రూపాయలు ఆస్తి నాగశౌర్యకు పెళ్లి కానుకగా అందబోతోంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో ఎవరికీ తెలియదు. దీనిపై నాగశౌర్య కానీ అనూష ఫ్యామిలీ గాని ఇంతవరకు స్పందించలేదు.

యంగ్ హీరో నాగ శౌర్య మొదటి సినిమా చలో మూవీ తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మంచి క్రేజీ సంపాదించుకున్నాడు.వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఏకైక హీరో నాగ సౌర్య అని చెప్పొచ్చు. వరస సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ సరైన గుర్తింపు నిచ్చే ఒక సినిమా కూడా పడలేదని నిరుత్సాహంలో ఉన్న నాగశౌర్యకు ఈ ఏడాది కృష్ణ వ్రింద విహారి సినిమాతో మరోసారి సక్సెస్ సాధించింది మరిన్ని కొత్త అవకాశాలను సొంతం చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడని నాగశౌర్య అభిమానులు చెప్పుకుంటున్నారు.