బిగ్ బాస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని ఎదురు చూస్తున్న నాగార్జున ..?

Bigg Boss 4 Telugu

టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ఒకవైపు బిగ్ బాస్ సీజన్ 4 కి హోస్ట్ గా వ్యవహరిస్తూనే మరోవైపు ఆయన టైటిల్ రోల్ పోషిస్తోన్న ‘వైల్డ్ డాగ్‌’ సినిమాని రీసెంట్ గా కంప్లీట్ చేశాడు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తుండగా… నూతన దర్శకుడు అహిషోర్ సాల్మన్ ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. కాగా ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ హిమాచ‌ల్ ప్రదేశ్‌లోని మ‌నాలీలో జరిగింది. అలాగే బాలీవుడ్ లో నాగార్జున నటిస్తున్న అత్యంత భారీ మల్టీస్టారర్ బ్రహ్మాస్త్ర కూడా ఇటీవలే కంప్లీట్ చేశాడు.

On Nagarjuna's 61st Birthday, Wild Dog Team Unveils New Look From the Film

కాగా ఇప్పుడు నాగార్జున ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ కంప్లీట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాడట. అందుకు కారణం బంగార్రాజు సినిమా అని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జు స్వీయ నిర్మాణంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించబోతున్నాడు. సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్ గా రూపొందబోతున్న ఈ సినిమాలో నాగార్జున తో పాటు నాగ చైతన్య, రమ్యకృష్ణ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

Nagarjuna on about Bangarraju Movie

కాగా ఈ సినిమా డిసెంబర్ 3 వ వారం నుంచి మొదలు పెట్టాలని దర్శకుడు షెడ్యూల్ ప్లాన్ చేశాడట. ఇక నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో బంగార్రజుగా అలరించాడు. అందుకే మరోసారి ఆలాంటి గెటప్ లో కనిపించేందుకు నాగార్జున ఆతృతగా ఉన్నాడట. అయితే ఈ సినిమాలో అఖిల్ కూడా నటించబోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో. కాగా సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కబోతున్న బంగార్రాజు 2021 సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకే సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమా కంప్లీట్ చేయబోతున్నట్టు సమాచారం.