నాగార్జునకి సాయం చేసేదెవ్వరు.?

బుల్లితెర గేమ్ షో బిగ్‌బాస్‌కి వున్న క్రేజ్ వేరే లెవల్. అయితే, మొదటి రెండు సీజన్లు వర్కవుట్ అయినట్లుగా ఆ తర్వాతి సీజన్లు వర్కవుట్ కావడం లేదు. గ్రాడ్యుయల్‌గా డౌన్ ఫాల్ అవుతూ వస్తోంది ఈ గేమ్ షో. అందుకు కారణం హోస్ట్ నాగార్జునే.. అనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. హోస్ట్‌ని మార్చండ్రా బాబూ..! అని వీక్షకులు మొత్తుకుంటూనే వున్నారు.

కానీ, బిగ్‌బాస్ నిర్వాహకులు ఎందుకో మరో హోస్ట్ కోసం ప్రయత్నాలు చేయడం లేదా.? లేక బిగ్‌బాస్ అంటే బాబోయ్ అంటున్నారా హోస్ట్‌గా వుండేందుకు.. తెలియడం లేదు కానీ, నాగార్జున అంటే బిగ్‌బాస్, బిగ్‌బాస్ అంటే నాగార్జున అన్న చందంగా మారిపోయింది.

ఈ సారి ‘కుడి ఎడమైతే..’ అంటూ ఉల్టా ఫల్టా థియరీతో బిగ్‌బాస్ సిద్ధంగా వున్నాడు. ఏవేవో ప్రోమోలు రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేసేందుకు కష్టపడుతున్నారు. కానీ, హోస్ట్ విషయంలో ఏమాత్ర సంతృప్తికరంగా లేరట ఆడియన్స్.

మరికొద్ది రోజుల్లోనే బిగ్‌బాస్ ఏడో సీజన్ స్టార్ట్ కానుంది. సీజన్ స్టార్టవుతుందంటే చాలు.. విపరీతమైన నెగిటివిటీ కూడా స్టార్ట్ అవుతుంటుంది. మరి, ఈ నెగిటివిటీ నుంచి నాగార్జునను కాపాడేదెవ్వరు.? లెట్స్ వెయిట్ అండ్ సీ.!