ఫినాలేకి డుమ్మా కొట్టిన నాగార్జున… ఆయన స్థానంలో బాధ్యతలు తీసుకున్న స్టార్ హీరో?

బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. గత వారం హౌస్ నుంచి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ కాగా ప్రస్తుతం హౌస్ లో ఏడు మంది కంటెస్టెంట్ లు ఉన్నారు.ఇక వీరిలో ఇద్దరిని ఈ వారం మధ్యలోనే హౌస్ నుంచి బయటకు పంపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్ లతో ఈ వారం గ్రాండ్ ఫినాలే ఎంతో ఘనంగా జరగనుంది. ఇక ఈ కార్యక్రమాన్ని మూడు రోజులపాటు ఎంతో ఘనంగా నిర్వహించాలని నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇకపోతే గత కొన్ని సీజన్ల నుంచి బిగ్ బాస్ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈసారి గ్రాండ్ ఫినాలేకు నాగార్జున హోస్ట్ గా బాధ్యతలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. కొన్ని ఇతర కమిట్మెంట్స్ కారణంగా గ్రాండ్ ఫినాలేకి నాగార్జున దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఇకపోతే నాగార్జున స్థానంలో ఈ కార్యక్రమానికి హీరో వెంకటేష్ లేదా రామ్ చరణ్ హాజరుకానున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఇక నాగార్జున స్థానంలో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి రామ్ చరణ్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. అయితే ప్రస్తుతం ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియాలంటే నిర్వాహకులు అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాలి. ఇకపోతే నేటితో ఈ కార్యక్రమానికి ఓటింగ్ పూర్తి అయ్యింది. బిందుమాధవి విన్నర్ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ ఎవరో తెలియాలంటే మరి రెండు రోజులు వేచి చూడాలి.