నాగ్ మీమాంశ.! భక్తి చిత్రమా.? చారిత్రక నేపథ్యమా.?

అక్కినేని ఫ్యామిలీకి ఏ సినిమా చేసినా కలిసి రావడం లేదు. ఓ పక్క కొడుకుల పరిస్థితీ అలాగే వుంది. తండ్రి నాగార్జున పరిస్థితి అలాగే వుంది. ‘ఏజెంట్’, ‘కస్డడీ’ సినిమాలను ఎంత ట్రై చేసినా ఆడించలేకపోయారు. హిట్టు లిస్టులో వేయలేకపోయారు. ఇక, ఇప్పుడు స్వయంగా అక్కినేని నాగార్జునే రంగంలోకి దిగబోతున్నాడట. ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కించబోతున్నాడట.

ఆల్రెడీ రెండు కథలు ఓకే చేసి పెట్టాడట నాగార్జున. ఇద్దరూ టాలెంటెడ్ దర్శకులేనని సమాచారం. రెండిటిలో ఒకటి ముందు పట్టాలెక్కబోతోందనీ తెలుస్తోంది. అయితే రెండింట్లో చారిత్రక నేపథ్యం ఒకటి.. ఇంకోటేమో భక్తి చిత్రానికి సంబంధించిన కథలున్నాయట. వాటిలో ఏది ముందు పట్టాలెక్కించాలా.? అనే డైలమాలో నాగార్జున వున్నట్లు తెలుస్తోంది.

గతంలో భక్తి నేపథ్యంలో వచ్చిన ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ వంటి చిత్రాలు నాగార్జున కెరీర్‌లో సంచలన విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. అదే ప్రయత్నం ఇప్పుడు చేయబోతున్నాడట. అతి త్వరలోనే అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నాడట నాగార్జున.