గురువు బాటలోనే శిష్యుడు… ఆర్పీ వ్యాఖ్యల వెనుక ఉన్నది అతనేనా?

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా జబర్దస్త్ గురించి చర్చ జరుగుతుంది. ఇటీవల కిరాక్ ఆర్పి జబర్దస్త్ గురించి, జబర్దస్త్ యాజమాన్యం గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జబర్దస్త్ యాజమాన్యం వారు అక్కడ పని చేసే వారిని బానిసలుగా చూస్తున్నారని, సరైన భోజనం కూడా పెట్టరు అంటూ ఆర్పి షాకింగ్ కామెంట్స్ చేశాడు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి మా అందరి టాలెంట్ వాడుకొని పేమెంట్ ఇవ్వకుండా కోట్లు సంపాదిస్తున్నాడు అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఆర్పి జబర్దస్త్ గురించి చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతూ ఆది, రాం ప్రసాద్, శేషు వంటి వారు ఇంటర్వ్యు ఇస్తు ఆర్పి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

తాజాగా ఒకప్పుడు మల్లెమాల సంస్థలో మేనేజర్ గా పని చేసిన ఏడుకొండలు కూడా ఇంటర్వ్యూ లో పాల్గొని జబర్దస్త్ గురించి ఆర్పి చేసిన ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. ఆర్పి జబర్దస్త్ మానేసి నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు ఇలా జబర్దస్త్ గురించి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన వెల్లడించారు. అంతే కాకుండా జబర్దస్త్ లో ఎంతోమందికి అవకాశం ఇచ్చి జీవితాన్ని ఇస్తే ఇప్పుడు వాళ్ళు నా ఫోన్ కూడా తీయరు అంటూ సుధీర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక గెటప్ శ్రీను జబర్దస్త్ మానేసి బయట ఎక్కడా షో లు చేయలేడు అంటూ శ్రీను గురించి వెల్లడించాడు.

అయితే ఇప్పుడు జబర్దస్త్ గురించి జరుగుతున్న వివాదాన్ని ముందుగా తెరలేపిన వ్యక్తి నాగబాబు. ఆరు సంవత్సరాలు జబర్దస్త్ లో జడ్జ్ గా పని చేసిన నాగబాబు కూడా అక్కడ యాజమాన్యంతో మనస్పర్థలు వచ్చి బయటికి వచ్చేసాడు. ఆ సమయంలో రెమ్యూనరేషన్ గురించి, ఫుడ్ గురించి నాగబాబు కూడా అరోపణలు చేశాడు. ఇక ఇప్పుడు నాగబాబు ప్రియ శిష్యుడు కిర్రాక్ ఆర్పి కూడా అదే రీతిలో జబర్దస్త్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అందువల్ల నాగబాబు వెనకుండి ఇదంతా నడిపిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ విషయంలో నాగబాబు ఎప్పుడూ స్పందిస్తారని అందరూ ఎదురుచూస్తున్నారు.