Comedian Prudhvi Raj: మెగా ఫ్యామిలో తాను చిరంజీవి గారితో నటించిన సినిమా ఖైదీ నెం.150 అని, కానీ ఆ సీన్ కట్ అవుతుందని తనకు కో-డైరెక్టర్ ముందే చెప్పారని సినీ నటుడు పృద్వీ రాజ్ తెలిపారు. మామూలుగా తనను అప్పుడు మాటలో మధ్యలో అడిగినపుడు మా అమ్మ చనిపోయినంత బాధపడ్డాను నేను.. పెద్దాయన సినిమాలో లేకపోవడం అని తాను అన్నట్టు పృధ్వీ చెప్పారు. అది ఆ తర్వాత వైరల్ అవడంతో తన సీన్‌ను మళ్లీ సినిమాలో పెద్దాయన పెట్టించారని ఆయన అన్నారు. ఇకపోతే పవన్ కల్యాణ్‌తో కాటమరాయుడు, గబ్బర్ సింగ్ లాంటి హిట్ సినిమాల్లోనూ చేశానన్న ఆయన, వాళ్లతో ఎలాంటి ఇబ్బందీ రాలేదని ఆయన స్పష్టం చేశారు. సినిమా పరంగా అయినా, పార్టీ పరంగా నైనా ఆయన్ని తాను ఏమీ అనలేదని పృధ్వీ చెప్పారు.
ఇకపోతే తనకు, నాగబాబుకు మధ్య విబేధాల గురించి పృధ్వీ స్పందించారు. వారిద్దరి మధ్య ఉన్నది చాలా చిన్న విషయమని, అది కేవలం టీ కప్పులో తుపాను లాంటిదని ఆయన చెప్పారు. టీ కప్పులో తుపాను అంటే ఎంత ఉంటుంది అని ఆయన సరదాగా చెప్పారు. జీ తెలుగు వారు ఉమ్మడి కుటుంబంలో కమ్మని భోజనం అనే ఓ ప్రోగ్రామ్ పెట్టినపుడు, తానెళ్లినపుడు నాగబాబు ఉన్నారా అని షాక్ అయ్యానని, ఆ తర్వాత కాసేపాగి వెళ్లి ఆయన్ని కలిసి నమస్కారం చెప్పి, దూరంగా కూర్చున్నానని ఆయన చెప్పారు. అప్పుడు నాగబాబే తనను పిలిచి, మా తమ్ముడు మెగా ఫ్యామిలీలోనే మంచి టైమింగ్ ఉన్న కమెడియన్‌ని ఇష్టపడుతారు అంటే అది పృధ్వీనే అని తనకు చెప్పినట్టు ఆయన తెలిపారు. పనీ పాటా లేని వాళ్లు నీ మీద ఏవేవో సృష్టిస్తున్నారు.. అవేం పట్టించుకోవద్దని, తామంతా నవ్వుకున్నామని, నువ్వేంటో మాకు తెలుసు అని నాగబాబు అన్నట్టు పృధ్వీ చెప్పారు.
ఆ తర్వాత మళ్లీ ఆయనే సినిమా వేరు, పార్టీ వేరు అని అన్నారని పృధ్వీ అన్నారు. సినిమాను దృష్టిలో పెట్టుకొని, పార్టీని అనకూడదు.. పార్టీని దృష్టిలోపెట్టుకొని సినిమాను అనకూడదని అన్నట్టు ఆయన చెప్పారు. అంటే ఆయన అన్నదేంటంటే సినిమా వేరు, రాజకీయాలు వేరు ఎప్పుడు ఎలా ఉండాలో అలానే ఉండాలని అన్నారు గానీ తామిద్దరి మధ్య అసలు ఎలాంటి విభేదాలూ లేవని, అనవసరంగా తమ మధ్య ఏదో జరిగిందని తప్పుడు ప్రచారం చేశారని ఆయన స్పష్టం చేశారు.