మెగా డాటర్ నిహారిక, నాగబాబు మధ్య ఉండే అన్యోన్యత అందరికీ తెలిసిందే. తండ్రీ కూతుళ్లకు బెస్ట్ ఎగ్జాంపుల్స్‌గా ఈ ఇద్దరినీ చూపించొచ్చు. కూతురిపై ఎంత ప్రేమను చూపించాలి.. ఎంత స్వేచ్చను ఇవ్వాలి అన్నది నాగబాబు వద్ద నేర్చుకోవచ్చు. కూతురు ఎలా ఉండాలి.. ఎలా మెలగాలి అన్నది నిహారిక వద్ద తెలుసుకోవచ్చు. తండ్రీ కూతుళ్లలా కాకుండా ఫ్రెండ్స్‌లా ఉండాలని వీరిద్దరూ చెప్పకనే చెబుతారు.
నిహారికపై ఉన్న ప్రేమను నాగబాబు ఆ మధ్య ఓ షోలో చెప్పుకొచ్చాడు. ఓ సారి నిహారిక న్యూజిలాండ్ దేశంలో తప్పిపోయిందని, తనలాగే కోటు వేసుకున్న ఒకడి చేయి పట్టుకుని వెళ్లిపోయిందని నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. అలా ఓ పదిహేను నిమిషాలు నిహారిక కనిపించకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందంటూ ఎమోషనల్ అయ్యాడు. అంతలా కూతురంటే నాగబాబుకు ఇష్టం.
అలాంటి కూతురిని నాగబాబు ఏడిపిస్తూ ఉంటాడు. చిన్నతనం నుంచి ఓ అబద్దం చెప్పి పెంచాడు. నువ్ స్పెషల్ బేబీవి.. నా కడుపులోనే పుట్టావ్ అని చెప్పి నిహారికను నమ్మించాడు. ఎనిమిదో క్లాస్ వరకు అదే నిజమని భ్రమిలో బతికిందట. మామూలుగా నిహారిక అంత బ్రైట్ స్టూడెంట్ ఏమీ కాదట.. కాలేజ్‌కు కూడా వెళ్లేది కాదట. ఎప్పుడూ అటెండెన్స్ పర్సంటేజ్ చెప్పి ఏడిపిస్తాడట. ‘ఇంట్లో నీళ్లు తీసుకురమ్మంటాడు.. నేను తీసుకరాను అని అంటాను.. 29 పర్సెంటేజ్ అటెండెన్స్ వచ్చిన వాళ్లకు కూడా నీళ్లు తీసుకురావడానికి నొప్పి ఏంట’ని కౌంటర్ వేస్తాడంటూ తండ్రి గురించి నిహారిక చెప్పుకొచ్చింది.