Naga Shourya : రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ గా నాగ శౌర్య కొత్త సినిమా…!

 

Naga Shourya:టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నాగ శౌర్య ఒకరు.వరుస సినిమా లు చేస్తూనే ఉన్న ఆశించినంత విజయాన్ని మాత్రం అందుకోలేదు. ఛలో సినిమాతో మంచి విజయం సొంతం చేసుకున్న ఆ తర్వాత ఆ విజయాన్ని సరిగా వాడుకోలేక పోయాడు. కణం లాంటి ప్రయోగాలు చేసిన ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.ఇక అమ్మమ్మ గారి ఇల్లు ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చినా టెలివిజన్ లో అయితే చూడొచ్చు అనేలా ఉంది. ఇక ఇటీవలే వచ్చిన అశ్వధామ కూడా నిరాశను మిగిల్చింది.

ఇక నాగ శౌర్యా ప్రస్తుతం డైరెక్టర్ అనీష్ కృష్ణ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నారు. కృష్ణ వ్రీందా విహారి గా రానున్న శౌర్య.ఇక ఈ సినిమా లో నాగ శౌర్య కు జోడిగా షిర్లే షెటియా హీరోయిన్ గా నటిస్తోంది.నాగశౌర్య సొంత బ్యానర్ అయిన ‘ఐరా’ క్రియేషన్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. లవ్ తో కూడిన ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ కథ నడుస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. నిన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.. ఇటీవలే విడుదల అయినా ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన రాగా ఇప్పుడు టీజర్ కూడా రిలీజ్ చేసారు.ఈ సినిమా టీజర్ ను డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసి టీమ్ అందరికి శుభాకాంక్షలు తెలిపారు.

టీజర్ లో నాగ సౌర్య, షెర్లీసెటియా కార్పొరేట్ ఆఫీస్ లో పని చేసే సహా ఉద్యోగులుగా కనిపించారు. హీరోయిన్ తన పరిసరాల్లోకి వచ్చిన ప్రతిసారి నాగ శౌర్య తన గుండెలో బెల్ సౌండ్ వింటున్నాడు.. అతడు ఆమెను ఆకట్టు కోవడానికి చేసే ప్రయత్నాలను చాలా బాగా చూపించారు. ఇద్దరి మధ్య ప్రేమ వికసించిన తర్వాత షెర్లీ తన స్వంత కారణంతో అతనిని తప్పించుకోవడం స్టార్ట్ అవుతుంది. వీరిద్దరి మధ్య రొమాంటిక్ ట్రాక్ చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. నాగ శౌర్య తొలిసారిగా బ్రాహ్మణా యువకుడి పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు.. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతుంది.