Naga Shourya : సమ్మర్ ట్రీట్ ఇవ్వడానికి వస్తున్న ‘కృష్ణ వ్రింద విహారి’… ఎపుడో తెలుసా..?

Naga Shourya : ప్రస్తుతం వున్న యంగ్ హీరోలలో నాగశౌర్య తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఛలో సినిమా తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్‌ ఆర్. కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.సింగర్‌ షిర్లీ సేథియా తొలిసారి హీరోయిన్ గా పరిచయం ఐయింది. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్హున్నారు.మహతి స్వర సాగర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ చిత్ర విడుదల తారీఖుని ప్రకటించారు చిత్రబృందం. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మే 20న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు.  విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక పోస్టర్ కూడా విడదల చేశారు. ఇటీవల సినిమా నుంచి విడుదలైన టీజర్ పాటలకు మంచి స్పందన లభిస్తోంది.

ఈ చిత్రంలో నాగశౌర్య ఒక బ్రాహ్మణ యువకుడు గా నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్న ఈ సినిమా తో తప్పకుండ హిట్ కొట్టాలని ఆలోచిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రాధికా శరత్‌ కుమార్‌ ఓ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం.విడుదల చేసిన పోస్టర్లో నాగశౌర్య ఏదో ఆలోచిస్తూ సూపర్‌ కూల్‌గా ఉన్నాడు.