యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ చిత్రంతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఇతడు.. వరుస చిత్రాల్లో నటిస్తూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. సాఫ్ట్ క్యారెక్టర్ లలో ఎక్కువగా కనిపించే ఈయన చందమామ కథలు సినిమాలో నటించి మెప్పించాడు. అయితే రీల్ లో ఈయన హీరోగా కనిపించినప్పటికీ.. ఇప్పుడు మాత్రం రియల్ హీరో అయ్యాడంటూ నెట్టింట చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఎందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
యువ హీరో నాగశౌర్యకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అందులో ఆయన రోడ్డు మీద కారులో వెళ్తుండగా… ఓ అమ్మాయిపై అబ్బాయి చేయి చేసుకోవడం గమనించాడు. వెంటనే కారు ఆపి.. కిందకు దిగి వచ్చాడు. సదరు యువకుడితో గొడవకు దిగాడు. ఎందుకు కొట్టావంటూ ఫైర్ అయ్యాడు. దీంతో భయపడిపోయిన అమ్మాయి, అబ్బాయి అక్కడి నుంచి వెళ్లిపోతుండగా… అమ్మాయికి ముందు సారీ చెప్పు అంటూ నాగశౌర్య సదరు యువకుడికి చెప్పాడు. దగ్గరుండి మరీ అతడితో అమ్మాయికి సారీ చెప్పించాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహిళల పట్ల నాగశౌర్య చూపించిన గౌరవం, మర్యాదల పట్ల నెటిజెన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగశౌర్య రీల్ హీరో కాదు రియల్ హీరో అంటూ కామెంట్లు చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న ఓ అమ్మాయిని.. అబ్బాయి కొడుతుంటే చూడలేక సారీ చెప్పించడం చాలా గ్రేట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాఫ్ట్ గా కనిపించే నాగశౌర్య.. మహిళలకు ఏమైనా సమస్య వస్తే ఈ రేంజ్ లో స్పందిస్తారా అంటూ మరో నెటిజెన్ కామెంట్ చేశాడు.
అయితే అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగశౌర్య తాజాగా నటించిన చిత్రం ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి సినిమా మార్చి 17వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో మాళవికా నాయర్ హీరోయిన్. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా రిలీజ్ తర్వాత నూతన దర్శకుడు ఎస్ఎస్ అరుణాచలంతో వైష్ణవి ఫిలింస్ నిర్మాణంలో నాగశౌర్య మరో సినిమా చేయబోతున్నారు.
Matter endi pic.twitter.com/IldGEqdxvr
— UnqBoi 🍥 (@UnqBoi007) February 28, 2023